అమ్రాబాద్, అక్టోబర్ 16 : అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమం గా నిర్మించిన కట్టడాలను బుధవారం అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించిన అన తి కాలంలోనే అధికారులు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారిం ది.
మన్ననూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా వ్యాపారం కోసం నిర్మించిన షెటర్లను తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేసినా తొలగించకపోవడంతో చర్యలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి భీముడు తెలిపారు.