మహబూబ్‌నగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు గొడవకు దిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇరువురు తిట్టుకుంటూ.. కొట్టుకున్నంత పనిచేశారని సదరు పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. వీరు కొ ట్లాడుతుండగా.. ఇరు వర్గాలకు చెం దిన కార్యకర్తలు భారీగా క్యాంపు కా ర్యాలయానికి చేరుకున్నారని.. దీంతో స్థానిక ఎమ్మెల్యే అసహనం వ్య క్తం చేసినట్లు తెలిసింది.
వారం రోజుల కిందట కూడా ఇలాగే గొడవ పడితే శా సనసభ్యుడు జోక్యం చేసుకొని సర్ది చెప్పినట్లు పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా ఇరువర్గాలు చీలిపోయి నువ్వెంతంటే.. నువ్వెంతంటూ గొడవకు దిగినట్లు.. అరధరాత్రి వరకు తిట్ల పురాణం నడిచిందని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. బాహాబాహీకి దిగిన వారిలో ఓ ప్రజాప్రతినిధి బావమరిది.. ముఖ్య అనుచరులే ఉన్నట్లు చెవులు కొ రుక్కొంటున్నారు.
ఈ వ్యవహారం బ యట పడడంతో జిల్లా కేంద్రంలో జోరుగా చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో పాత కాంగ్రెస్ నేతలకు, ఎమ్మె ల్యే అనుచరులకు మధ్య అస్సలు పొసగడం లేదు.. దీంతో ఈ రచ్చ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరగడంతో ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా.. క్యాంప్ కార్యాలయంలో జరిగిన గొడవలు ఎక్కడ బయటికి పొక్కుతాయనో భయపడి సీసీ కెమెరా రికార్డులు మా యం చేసినట్లు ప్రచారం జరిగింది. చివరకు ఎమ్మెల్యే ఈ ఇద్దరు నేతల తీరుపై మండిపడినట్లు తెలుస్తోంది. కాగా పార్టీలో రెడ్డి, బీసీలుగా వి డిపోయారని పేరు చెప్పడానికి ఇష్ట పడని ఓ కాంగ్రెస్ నేత మీడియాకు లీకులిచ్చారు. మొత్తంపైన ఏడాది గాకముందే పార్టీ నేతల తీరుపై సొంత పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.