గద్వాల అర్బన్, మే 10: ప్రస్తుతం జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల కొనుగోలు కేంద్రాలో సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న వ్యవహారం సాగుతున్నది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కర్ణాటక వడ్లకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ వడ్లకు ఇవ్వడం లేదని పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు, దళారులు, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై రాత్రిరాత్రికే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించి కొనుగోలు చేస్తున్నారని శనివారం కేటీదొడ్డి మండలంలోని కొండాపురం రై తులు ఆరోపించారు. గ్రామంలో రాత్రికిరాత్రే వ చ్చిన వడ్లకు టోకెన్ ఇస్తున్నారని..
మా వడ్లకు టో కెన్ ఇవ్వలేదని.. మా వడ్లకు గన్నీ బ్యాగులు లేవం టూ నిలిపివేస్తున్నారని ఆవేదనతో గ్రామంలోని కొ నుగోలు కేంద్రం గదికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. మండలంలో కొన్ని గ్రామాల్లో కర్ణాటక వ డ్లు పెద్ద మొత్తంలో వచ్చిన్నట్లు ఆరోపించారు. తమ వడ్లు కల్లాలకే పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక వడ్లు నేరుగా మిల్లులకే పంపుతున్నారని, వాటిని నేరుగా పంపడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు రాజకీయం చేస్తున్నారని, వారి పా ర్టీకి చెందిన వారికి ముందుగా వడ్లు నింపుతున్నారని, వేరే పార్టీకి చెందిన వారి వడ్లు నింపడంలో కా లయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయా న్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పెద్దగా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవస రం ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై తనిఖీ చేస్తున్నాం
రైతుల ఫిర్యాదు మేరకు కొండాపురం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించాం. ఎక్కడా ఇతర ప్రాంతాలకు చెందిన వడ్లు రాలేదు. గన్నీ బ్యా గులు ఇవ్వడంలో కొంత మేర ఆలస్యమైంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వడ్లు తరలించడంలో కొంతమేర ఆలస్యమవుతున్నది. సమస్య ను పరిష్కరించాం. అన్ని వడ్లు వీలైనంత త్వరగా తరలిస్తాం. అలాగే ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వడ్లను కొనుగోలు చేయం.
– గోపాల్, ఐకేపీ కేంద్రాల నిర్వాహకుడు