నారాయణపేట, సెప్టెంబర్ 19 : జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం రాత్రి జెండాలు కట్టడంలో జరిగిన వివాదంలో రెండు వర్గా లు ఘర్షణ పడి రాళ్లు విసురుకున్నారని, ఎస్పీ యోగేశ్ గౌతమ్ సిబ్బందితో కలిసి అల్లరి మూకలను చెదరగొట్టారని వివరించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటమన్నారు. మత పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కేం ద్రంలో ప్రజల భద్రతపై భరోసా కల్పించేందుకు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జోగుళాంబ జోన్ 7 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్, ఎస్పీ యోగేశ్ గౌతమ్, నాగర్కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్, టీఎస్ఎస్పీఏ అదనపు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ లింగయ్య పాల్గొన్నారు.