మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 8 : బస్టాండ్ వ ద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్‌ను 99 ఏండ్లపాటు లీజ్‌కు తీసుకున్నానని మంత్రి దామోదర రాజనర్సిం హ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాటల్లో వాస్తవంలేదని.. ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. అవాస్తవమైతే మీరు తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా నిరూపించండి.. ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తా. రోగుల బంధువులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఎదుట షాపింగ్ కాంప్లె క్స్, హోటల్ నిర్మాణం చేపట్టాం’ అని తెలిపారు. దే శ, విదేశీయులు, ఐటీ ఉద్యోగులు సమావేశాలు నిర్వహించుకునేందుకు హోటల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ పనులను పూర్తి చేసే ప్రయ త్నం చేయకుండా తప్పుడు ఆరోపణలతో కాలం వె ల్లదీస్తున్నారని విమర్శించారు. పట్టణంలో తన ఫొటోతో అభిమానులు ఫ్లెక్సీలు కడితే వాటిని చింపివేయడం దారుణమన్నారు. బ్యానర్లు చించినంత మాత్రాన ప్రజల గుండెల్లో అభిమానాన్ని చెరిపివేయలేరన్నారు. పాలమూరులో అభివృద్ధిని చూస్తే ప్రజలకు శ్రీనివాస్‌గౌడ్ గురుకొస్తాడన్న విషయాన్ని గమనించాలన్నారు. దౌర్జన్యాలు, తప్పుడు ఆరోపణలు మాని ప్రజలకు ఇచ్చిన హమీలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, నిలిచిపోయిన పనులపై ఆలోచించాలని సూచించారు.
ఐటీ కారిడార్, జంక్షన్లు, ట్యాంక్‌బండ్, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, మెడికల్ కాలేజీ లు, గురుకులాలు, మైనార్టీ స్కూళ్లు, కళాశాలల ని ర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇప్పుడే అధికారంలోకి వచ్చారు.. సమయం ఇద్దామనుకున్నాం కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నందున మీడియా ముందు కు రావాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో జే ఎన్టీయూ క్యాంపస్ ఏర్పాటుకు జీవో జారీ చే సినా.. ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మన్యంకొండ దేవస్థానం వద్ద రోప్‌వే, అభివృద్ధి ప నులు నిలిచిపోయాయన్నారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేయించినా పనులు ప్రారంభంకాలేదన్నారు. అండర్ గ్రౌండ్ పనులు, హన్వాడ మండలంలో చెక్‌డ్యాంలకు నిధులు విడుదలైనా వాటిని ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. రూ.కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆ పనుల ను ప్రారంభించాల్సింది పోయి రాజకీయం చేయ డం తగదన్నారు. పదేండ్లల్లో ఎంతో కష్టపడి మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నాయకులు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని, క్షేత్రస్థాయిలో మ రింత పటిష్టపరుస్తామని, తామే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ము డా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గణేశ్, రాంలక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, సుధాకర్ పాల్గొన్నారు.