ఖిల్లాఘణపురం, ఆగస్టు 20 : రూ.76కోట్ల16లక్షలతో ఎగువనున్న 9 గిరిజన తండాలకు, 6 గ్రామాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కర్నెతండా లిఫ్ట్‌ను పూర్తి చేశామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కర్నెతండా లిఫ్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో రూ.76కోట్ల16లక్షలతో కర్నెతండా లిఫ్ట్‌ను పూర్తి చేశామని, కేవలం సబ్ స్టేషన్ నిర్మాణం మాత్రమే పెండింగ్‌లో ఉండేదని దీని కోసం రూ.2 కోట్లు మంజూరు చేసి ఉంచామని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో సబ్‌స్టేషన్ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం రెండేళ్లు తీసుకుందన్నారు.
రైతుల ఒత్తిడితో వెట్న్ నిర్వహించి బంద్ పెట్టారని కృష్ణా వరదలతో సమృద్ధిగా సాగు జలాలు ఉన్నందున వెంటనే తండా లిఫ్ట్ పంపులు ప్రారంభించి సాగు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాది మంది రైతులతో కర్నె తండాను లిఫ్ట్‌ను ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల సాగునీటికి నోచుకొని ఎత్తైన ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏర్పాటుతో రైతుల దశాబ్దాల కలను నిజం చేసిందన్నారు.
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మం డలంలో చేపట్టిన కర్నెతండా ఎత్తిపోతల పథకం విజయవంతంగా పూర్తి అవడంతో అసాధ్యం అనుకున్న దాన్ని చేసి చూపించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రతి చెరువుని సందర్శించి కాల్వల వెంట తిరిగి నీటి లభ్యతను పరిశీలించి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులను రూపొందించామని అందులో భాగంగానే సాగునీటికి నోచుకొని ప్రాంతాలను గు ర్తించి అక్కడ కూడా కృష్ణ నీళ్లు పారించాలని లక్ష్యంగా చేసుకొని ఎత్తైన ప్రాంతమైన వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో గిరిజన తండాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కర్నెతండా లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును డిజైన్ చేసిందన్నారు.
కర్నెతండా లిఫ్ట్ పనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 మార్చి 8న శంకుస్థాపన చేశారని, ఈ లిప్ట్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరిగాయని, కర్నెతండా లిఫ్ట్ట్ ఇరిగేషన్ స్కీం కింద ఘణపురం బ్రాంచ్ కెనాల్, బుద్ధారం బ్రాంచ్ కెనాల్ మద్య గల ఎత్తైన ప్రాంతంలోని 4500 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టి 90శాతం పూర్తి చేసిందని, మిగతా పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పట్టిందని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని దుయ్యబట్టారు. దాదాపు 6 గ్రామాలు, 9 గిరిజన తండాలకు సాగునీరు అందనుందన్నారు.
ఘణపురం బ్రాంచ్ కెనాల్ 7.3 కిలోమీటర్ల వద్ద ముందరితండా మైసమ్మ చెరువును నింపి ఒకటిన్నర కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ పంప్‌హౌస్‌కి నీటిని మళ్లించడానికి లిఫ్ట్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న డెలివరీ సిస్టర్న్ వరకు మొత్తం 58 మీటర్ల ఎత్తుకు పంపులు నీటిని ఎత్తిపోస్తాయని, ఇందుకోసం 800 హార్స్ పవర్ రెం డు మోటర్లు ఏర్పాటు చేశామని కేవలం సబ్ స్టేషన్ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందన్నారు. ఇప్పటికైనా రెండు రోజుల్లో పంపులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి ముట్టడించి పంపులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మాజీ ఎంపీపీ కృష్ణనాయక్, నందిమళ్ల అశోక్, రాళ్లకృష్ణయ్య, సామ్యానాయక్, జాతృనాయక్, పీన్యానాయక్, గోపాల్‌నాయక్, నరేశ్నాయక్తోపాటు జిల్లా, మండల నాయకుల తదితరులు పాల్గొన్నారు.