మక్తల్ : వేణుగోపాలస్వామి దేవాలయ ( Venugopala Swamy Temple) పునర్నిర్మాణంలో భాగంగా విగ్రహ ప్రతిష్ట హోమాధి కార్యక్రమాలను జగద్గురు శంకరాచార్య హంపి విరుపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి భారతి స్వామి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) హాజరై పూజలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వేణుగోపాల స్వామి దేవాలయాన్ని, ఆలయ కమిటీ సభ్యులు పునర్నిర్మాణం చేపట్టి స్వామివారి దివ్యమైన విగ్రహావిష్కరణ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ప్రతిష్టాపన ( Idol installation ) మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు.
పురాతనమైన వేణుగోపాలస్వామి దేవాలయం పునర్నిర్మాణం సందర్భంగా దేవాలయ నిర్మాణం తో పాటు స్వామి వారికి నిత్య పూజలు , ఆలయాని్ అభివృద్ధి పథకంలోకి తీసుకురావాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, నాయకులు అమ్రేష్, ఈశ్వర్ యాదవ్‌తోపాటు తదితరులు ఉన్నారు.