మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 25 : పాలమూరులో పేదల ఇండ్లకు త్వరలో నోటీసులు అందనున్నాయనే విషయం తెలియడంతో నిరుపేదల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పెద్ద చెరువు నాలా పరిధిలో ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయనే పేరుతో అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
బడాబాబుల వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు అధికార వర్గం అండదండలు ఉండే పెద్దల నిర్మాణాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికే సర్వే నెంబరు 523లో ది వ్యాంగుల ఇండ్లను అర్ధరాత్రి కూల్చివేసిన రెవె న్యూ, మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు వారికి పునరావాసం కల్పించలేదు. ఇప్పుడు కొత్తగా పెద్ద చెరువు నాలా ఆక్రమణల పేరుతో నోటీసులు జారీ చేయడంతో నిరుపేదలు ఆ గం అవుతున్నారు.
పాలమూరులో పెద్దచెరు వు పరిధిలో ఆక్రమణలు వదిలేసి.. ఎఫ్టీఎల్ పరిధి పూర్తిస్థాయిలో నిర్ధారించకుండా.. మైత్రీనగర్, బాలాజీనగర్ ప్రాంతాల్లో పెద్దచెరువు నాలా ఆక్రమణల పేరుతో నోటీసులు జారీ చే శారు. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మే రకే కూల్చివేతల ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ మున్సిపల్ అధికారులు ఎలాంటి హ డావుడి లేకుండానే పావులు కదుపుతుండడం తో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన బడాబాబుల నిర్మాణాలను కూల్చివేయకుండా.. సామాన్యులు, నిరుపేదలు నిర్మించుకునే ఇండ్లను కూల్చివేసేందుకు ప్రణాళికలు రచిస్తుండటం పాలమూరులో వివాదాస్పదంగా మారింది. బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన తప్పిదాలకు సామాన్యులను బలిచేస్తున్నారని కొందరు వాపోతున్నారు. ఎన్నో ఏండ్ల కిందట ఇతరుల నుంచి భూములు కొనుక్కుని ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి గూడు కట్టుకుంటే.. ఇన్నాళ్లు కిమ్మని అధికారులు గతంలో వారే ఆయా ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయించడం, విద్యుత్ మీటర్లు బిగించ డం,
పన్నులు వసూలు చేయడం వంటి వాటన్నింటినీ అధికారికంగా చేపట్టిన అధికారులు ఇప్పుడు అనుమతులు లేవంటూ.. నాలా ఆక్రమించారంటూ.. బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయంటూ నీటిపారుదల శాఖ అనుమతులు, ఎన్వోసీ, ఇతర విలువైన డాక్యుమెంట్లు లేవంటూ సవాలక్ష మెలికలు పెడుతుండటం నిరుపేదల గుండెలపై పిడుగు పడ్డట్లు అవుతోంది. మహబూబ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని మల్లమ్మకుంట, పెద్దచెరువు, ఎర్రకుంట, ఇమాంసాబ్‌కుంట, పాలకొండ పెద్దచెరువు, ఊరచెరువు, బోడోనికుంట తదితర చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలా, ఇతర ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇండ్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఆయా ఇండ్లకు సైతం త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం క లెక్టర్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, నీటిపారుదలశాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వే ఆధారంగా చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను ని ర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్లు మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండే ఇండ్లకు సంబంధించి న సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని అందులో భాగంగానే ఆయా ఇండ్ల యజమానుల వద్ద ఇంటి ని ర్మాణాలకు సంబంధించిన నీటిపారుదలశాఖ ఇచ్చిన ఎన్వోసీ, మున్సిపల్ అనుమతులు, తదితర డాక్యుమెంట్లు వారం రోజుల్లో సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు.