మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 5 : రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా పాలమూరు బాలబాలికల జట్లు నిలిచాయి. రన్నరప్‌గా హైదరాబాద్ బాలుర జట్టు, ఖ మ్మం బాలికల జట్లు నిలిచాయి. అడ్డాకుల మండలం రాచాలలో మూడు రోజులు గా నిర్వహిస్తున్న అండర్-17, 19 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ము గిశాయి. విజేత జట్లకు సా ట్ చైర్మన్ శివసేనారెడ్డి.. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, డీఈవో రవీందర్‌తో కలిసి షీల్డులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు, నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తు న్న నూతన స్పోర్ట్స్ పాలసీతో క్రీడాకారులకు భవిషత్తులో మంచి రోజులు వస్తాయని, ప్రతిభ ఉన్న ప్రతిఒక్కరికీ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తాయని, అందుకే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆయన సూ చించారు. అనంతరం మూసాపేట మండలంలోని వే ముల గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాలీబాల్ స్డేడియాన్ని శివాసేనారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ప్రా రంభించారు. కార్యక్రమం లో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ నాగార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ రాధిక, ఎంఈవో కురుమూర్తి, పీఈటీలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచ్‌లు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.