పెద్దకొత్తపల్లి, మే 30 : మండలంలోని గంట్రావుపల్లికి చెందిన నాగశేషుకు పదిహేనేండ్ల కిందట ఎల్లమ్మతో వివాహం జరిగింది. పదిహేనేండ్లు సవ్యంగా సాగిన వారికి సంసార జీవితంలో ఏడాది నుంచి కలహాలు మొదలయ్యా యి. ఎల్లమ్మ, నాగశేషు దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ఒక కూతురు ఉన్నారు.
ముఖ్యం గా నాగశేషుకి భార్యపై అనుమానం ఉండడం తో గురువారం రాత్రి భార్య ఎల్లమ్మ(40)తో గొడవపడి ఆమెను కిరాతంగా హత్య చేసి పోలీసులకు లొంగిపొయాడు. శుక్రవారం కొల్లాపూర్ సీఐ మహేశ్, పెద్దకొత్తపల్లి ఎస్సై సతీశ్ గ్రంటావుపల్లి గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరుడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.