భూత్పూర్, అక్టోబర్ 13 : భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భూత్పూర్ మండలం మద్దిగట్లలో చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మద్దిగట్ల గ్రామానికి చెందిన సౌటరాజు (30) భార్య మమత పదిహేను రోజుల కిందట హైదరాబాద్లోని తల్లిగారింటికి వెళ్లింది.
ఆదివారం సౌటరాజు భార్య మ మతకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచా డు. అయితే ఆమె మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు మరో రెండు మూడు రోజుల తర్వాత వస్తానని చెప్పడంతో తన భార్య ఇంటికి రావడం లేదని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గుర్తించిన కు టుంబ సభ్యులు జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం తో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించగా సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బాలకిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.