పెబ్బేరు, జనవరి 22 : పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెలో బుధవారం ఇండ్ల మధ్యకు మొసలి రావడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. బీచుపల్లి అనే వ్యక్తి ఆవరణలోని చెట్ల పొద ల్లో సంచరిస్తుండగా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యా రు.
వెంటనే వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన తన బృందం తో వచ్చి మొసలిని బంధించారు. సమీపంలోని జూరాల కాల్వ నుంచి గ్రామంలోకి వచ్చి ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. 11 అడుగుల పొడవు, 230 కిలోల బరువు గల ఈ భారీ మొసలిని తాళ్లతో బంధించి తీసుకెళ్లి కృష్ణానదిలో వదిలి వేశారు.