మాగనూరు (కృష్ణ ) : పదో తరగతి ( SSC ) పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులకు అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మండలంలో పదవ తరగతి టాపర్లను( Top Scorers) మండల విద్యాధికారి నిజాముద్దీన్, ఎస్సై నవీద్ సన్మానించారు.
ఈ విజయానికి ముఖ్య భూమిక వహించిన మండల విద్యాధికారి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులను తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్సై నవీద్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందని వివరించారు. టాపర్లకు నగదు బహుమతులు, ఫిజిక్స్ పుస్తకాలను అందజేశారు.
ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థిని ట్రాక్ చేస్తూ వారు జీవితంలో స్థిరపడే వరకు నిరంతర సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నాగరాజు, అర్జున్, కుర్మయ్య, నరేందర్, రమేష్, శివరాజ్, శాలిని, కే. శ్రీనివాస్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.