మైనార్టీల సంక్షేమం పట్టని రేవంత్
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మైనార్టీల సంక్షేమం పట్టదని, ఓ మైనార్టీ సోదరుడు ఆయనకు టోపీ పెట్టడానికి వస్తే తీసేశారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ లో ముస్లింలతో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే సెక్యులర్ సీఎం కేసీఆర్ అని అన్నారు.
- దేశంలో సెక్యులర్ సీఎం కేసీఆర్
- ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన కాంగ్రెస్
- హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
- కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త
- ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మైనార్టీల సంక్షేమం పట్టదని, ఓ మైనార్టీ సోదరుడు ఆయనకు టోపీ పెట్టడానికి వస్తే తీసేశారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ లో ముస్లింలతో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే సెక్యులర్ సీఎం కేసీఆర్ అని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నదన్నారు.
– మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 24
మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 24 : దేశంలోనే సె క్యులర్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన మైనార్టీల ఆ త్మీయ సమ్మేళనంలో మంత్రులు మహమూద్ అలీ, డా క్టర్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు షా షాబ్గుట్ట, మోటర్‌లైన్ మసీదు వద్ద జుమా నమాజు అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాషాబ్‌గుట్ట దర్గాలో దర్గా పీఠాధిపతి సయ్యద్ రజాక్ షా ఖాద్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పదేళ్ల లో బీఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు జరిగిన సంక్షేమాన్ని ముస్లిం మైనార్టీలకు వివరించారు. అనంతరం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించా రు. ప్రతిపక్ష నాయకుడు రేవంత్‌రెడ్డికి మైనార్టీల మనోభావాలు ఏమాత్రం పట్టవని.. ఓ మైనార్టీ సోదరుడు ఓ సభలో రేవంత్‌రెడ్డికి టోపీ పెట్టడానికి వస్తే తీసేశారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాత్రం సెక్యులర్ భావజాలంతో మైనార్టీలకు అండగా నిలుస్తున్నారని తెలిపా రు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధికి కావాల్సిన నిధులను కొట్లాడి తెచ్చుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు మహబూబ్‌నగర్ అంటే ఎంతో అభిమానమన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేశారన్నా రు. గంగా జమున తెహజీబ్ అంటే తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మైనార్టీ గురుకులాలు ఏ ర్పాటు చేసి కృషి చేస్తున్న ఘనత మనదేనన్నారు. స్థానికంగా మైనార్టీలకు అన్ని విధాల ప్రాధాన్యమిస్తున్న మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూశారు
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మైనార్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలో ఆరు మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారి అభ్యర్థులు కుల, మత రాజకీయాలు చేస్తారని తెలిపారు. కుల, మతాలను రెచ్చగొట్టిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పదేండ్లలో మహబూబ్‌నగర్‌లో జరిగిన అభివృద్ధి కంటి ముందు కనిపిస్తుందని తెలిపారు. మైనార్టీలు మనస్పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ మసిఉల్లా, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, బీఆర్ఎస్ నాయకుడు సయ్య ద్ ఇబ్రహీం, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమా న్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌హాది, ఎంఐఎం నాయకులు జాబెర్, జాకీర్, సాదత్, వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడు అన్వర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు మోసిన్‌ఖాన్, మహమూద్‌అలీ, మహ్మద్ ఇక్బాల్, వా హేద్తాజ్, మఖ్బూల్, రహీం, సమద్ ఖాన్, తఖి, హ ఫెజ్ ఇద్రీస్, హకీం, సుల్తాన్, మోసిన్, మతపెద్దలు మౌలానా ఫైజోద్దీన్, మౌలానా మౌసిన్ పాషా ఖాద్రీ, సాధిక్, జావిద్, ఇమ్రాన్, ముజంమిల్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

