కొల్లాపూర్, మార్చి 14: కొల్లాపూర్ పట్టణంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పట్టణ వీధుల్లో యువత భారీగా బయటకు వచ్చి హోలీ సంబరాలు చేసుకున్నారు. గురువారం రాత్రి కాముని దహన కార్యక్రమంలో గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హోలీ సంబరాలలో పాల్గొని కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రంగుల పండుగ హోలీ, మీ అందరీ జీవితాలను రంగులతో నింపాలన్నారు.ఈ హోలీ నాడు మీ కష్టాలన్నీ తొలగించాలని. మీ జీవితం అనందమయం కావాలి’అని ఆకాంక్షించారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కొల్లాపూర్ పట్టణ కేంద్రం లో బీరం హర్షవర్ధన్ రెడ్డి తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ పండుగలో పాల్గొన్నారు. రామాలయం వద్ద బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకున్నారు.