పెద్దమందడి, మార్చి 14 : పెద్దమందడి మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగలో ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ అంటేనే చిన్నారులకు ఎనలేని ఆనందపడతారు. అలాంటి హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు వేసుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు మోదుగ పువ్వు తో తయారుచేసిన రంగులను ఒకరికి ఒకరు చల్లుకుంటూ ఆనందంగా హోలీ జరుపుకున్నారు. స్పీకర్ బాక్స్ దగ్గర వృత్యాలు చేసుకుంటూ హోలీ పండుగను అందరూ ఆనందంగా సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు ఉన్నారు.
కొత్త కోటలో రంగురంగుల హోలీ
కొత్తకోట పట్టణంలో శుక్రవారం పలుచోట్ల హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నపిల్లలతో మొదలుకొని, యువకులు, రాజకీయ నాయకులు హోలీ వేడుకలలో పాల్గొని ఒకరినొకరు రంగులు పూసుకుని సంబరాలు జరుపుకున్నారు.
Kothakota Temple
కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి దగ్గర గల సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వరదత్తదేవస్థానములో ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఆదిదంపతులైన శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు ఆలయకమిటీ అన్నదానం చేశారు.