గద్వాల అర్బన్,మార్చి 2 : జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టును హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ సంతోష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్ఛం అందచేసి ఆహ్వానం పలికారు. కోర్టును న్యాయమూర్తి పరిశీలించడంతోపాటు నిందితులకు శిక్షను త్వరగా అమలు చేయడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. కుషా, న్యాయమూర్తులు టి.లక్ష్మి, పూజిత, ఉదయ్నాయక్, మిథు న్ తేజ, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, బార్ అసోసియోషన్ సభ్యులు తది తరులు పాల్గొన్నారు.