కొల్లాపూర్, సెప్టెంబర్ 7 : వరుణదేవుడు వదలడం లేదు. కొల్లాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 10:30 గంటలకు మొదలైన వాన మధ్య రాత్రి వరకు కుండపోతగా కురిసింది. 60.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ గణాంకాధికారి విశ్వేశ్వర్ తెలిపారు.
ఎర్రగట్టు పెద్దవాగు పొంగి పారుతున్నది. ఉధృతంగా పారడం ఇదే మొదటి సారి అని సర్పంచ్ దశరథ్నాయక్ తెలిపారు. ముక్కిడిగుండం-నార్లాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని పలు వాగులు, వంకలు పారాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది.