గద్వాల, ఆగస్టు 30 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాలకు భారీగా వరదతో 3,21,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 45గేట్లు తెరిచి దిగువకు 3,31,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 8.300 టీఎంసీలుగా ఉన్నది. ఎడమ కాల్వకు 820, కుడికాల్వకు 620, కోయిల్‌సాగర్‌కు 315, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా, విద్యుదుత్పత్తికి 19,288 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం 30 గేట్లు ఎత్తి దిగువకు 1,78,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు మొత్తం అవుట్ ఫ్లో 3,31,047 క్యూసెక్కులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
అయిజ, ఆగస్టు 30 : ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,66,760 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,76,540 న మోదుకాగా ప్రాజె క్టు గరిష్ఠ నీటిమట్టం 129.72 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 122.10 టీఎంసీల నిల్వ ఉన్న ది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,84,821, అ వుట్ ఫ్లో 1,90,290 క్యూసెక్కులు కాగా, పూర్తిస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 32.02 టీఎంసీలుగా ఉన్నది. తుంగభద్రకు ఇన్‌ఫ్లో 31,159, అ వుట్ఫ్లో 10,067 క్యూసెక్కులుగా నమోదైంది. 105. 788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తు తం 92.424 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్కు ఇన్‌ఫ్లో 3,291 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,650 ఉండగా ఆయకట్టుకు 641 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం, ఆగస్టు 30 : శ్రీశైలం జలాశయానికి శుక్రవారం 3,05,279 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,79,370.., కుడిగట్టు, ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 68,500 క్యూసెక్కులను విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 3,47,870 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఏంసీలు కాగా.., ప్రస్తుతం 213.88 టీఏంసీలుగా ఉన్నది.