నారాయణపేట, అక్టోబర్ 3 : నేనూ ఒకప్పుడు ఉపాధ్యాయుడినేనని.. పదో తరగతిలో తక్కువ మార్కులొచ్చినప్పటికీ.. పట్టువిడువకుండా చదివి ఈ స్థాయికి చేరినట్లు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ యువ అధ్యక్షుడు శ్రీపాద్ అధ్యక్షతన ఎస్ఆర్ రెడ్డి యువ ఉద్యోగ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత మన ఉద్యోగాలు మనకే వస్తున్నాయన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రపతితో ప్రత్యేక ఉత్తర్వులు తీసుకువచ్చారన్నారు. పిల్లలను చదువుకోవడానికి మోటివేట్ చేయడమే ఉపాధ్యాయుల విధి అన్నారు. తాను కూడా ఎనిమిదేండ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగిందన్నారు. పదో తరగతిలో 47శాతం మార్కులు వచ్చాయ ని, నేడు ఎమ్మెల్యేగా, 18 విద్యాసంస్థలకు అధిపతిగా, ప్రతి ఏడాది 230 మంది డాక్టర్లను తయా రు చేసే విద్యాసంస్థను నడిపిస్తున్నానన్నారు.
16 దేశాలకు చెందిన విద్యార్థులు తన కళాశాలలో చ దువుతున్నట్లు చెప్పారు. 47 శాతం మార్కులు వ చ్చిన రాజేందర్‌రెడ్డి నేడు ఇంత ఎత్తుకు ఎదిగినప్పుడు 80-90 శాతం మార్కులు సాధించిన మీ లాంటి ఎంతో మంది విద్యార్థులు మరింత అద్బుతాలు సృష్టించవచ్చో అర్థం చేసుకోవాలన్నారు. ఇంటర్నెట్ను మేథస్సు పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, జెడ్పీటీసీ అంజలి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రంగారెడ్డి, యాప్ నిర్వాహకు లు చక్రవర్తి, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపళ్లు పద్మ, శేషమ్మ, రామకృష్ణ, కౌన్సిలర్లు గురులింగం, మ హేశ్, బీఆర్ఎస్ నాయకులు విజయ్‌సాగర్, ప్ర తాప్‌రెడ్డి, జగదీశ్, చెన్నారెడ్డి, చంద్రకాంత్, సుదర్శన్‌రెడ్డి, శివరాంరెడ్డి, కార్తీక్ పాల్గొన్నారు.