మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 19 : నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అయినా ఉన్నత లక్ష్యాలు రాణించాలనే తపన తో ఓ వైపు చెప్పులు కుడు తూ మరో వైపు విద్యనభ్యసి స్తూ.. ఉన్నతంగా ఎదిగి.. వర్సిటీ అధ్యాపకుడిగా డాక్టరేట్ సాధించి యువతకు స్ఫూర్తి గా నిలుస్తున్నారు పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల అధ్యాపకుడు బైరి సురేశ్. ఆయనకు శనివారం ఉస్మానియా యూనివర్సి టీ డాక్టరేట్ బహూకరించిన సందర్భంగా పీయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ నూర్జహాన్, విభాగాధిపతి ప్రభాకర్‌రెడ్డి, పీ ఆర్వో రవికుమార్, పీయూ అధ్యాపకులు, బోధన, బోధనేతర సంఘం నాయకులు సత్కరించి అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కల్లడికి చెందిన బాలయ్య, కళావతి దంపతుల మొదటి సంతానం బైరి సురేశ్.
ఈయన ప్రాథమిక విద్యాభ్యా సం అంతా కల్లడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే కొనసాగింది. ఇంటర్మీడియెట్ సోషల్వెల్ఫేర్ గురుకుల వి ద్యాలయం, బీఫార్మసీ వరంగల్‌లోని కాకతీయ యూ నివర్సిటీలో, ఎంఫార్మసీ పంజాబ్‌లోని నైపర్ మోహలీలో పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో గైడ్ టీచర్ ఎంఎన్ఆర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అలగర్‌స్వామి, సహాయ పర్యవేక్షకులుగా పూర్వ ప్రిన్సిపాల్, డీన్ ప్రొఫెసర్ శ్యాంసుందర్ క్యాన్సర్ మ హమ్మారి నియంత్రణలో భాగంగా ‘న్యూ హెటీరో సై క్లిక్ హైబ్రీడ్స్ డిజైన్ సింథసిస్’ అనే అంశంపై చేసిన ప రిశోధనకు డాక్టరేట్ వరించింది. ప్రస్తుతం ఈయన ఫా ర్మసీ కళాశాల ఒప్పంద అధ్యాపకుడిగా, పరీక్షల నిర్వహణ విభాగం ప్రొఫెషనల్ కోర్సుల కోఆర్డినేటర్‌గా బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన చేసిన పలు పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. పలు సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు.
చెప్పులు కుడుతూ చదువుకున్నా..
మాది పేద కుటుం బం. పాఠశాలకు వెళ్లివచ్చాక రోడ్డుపై చెప్పులు కుట్టేవాడిని. కళాశాల స్థా యిలోనూ గురుకులం లో, ఎం ఫార్మసీ, బీ-ఫార్మసీ చదివే సమయాల్లో నూ ఇంటికి వచ్చిన సం దర్భంలోనూ ఇంటికి పెద్దవాడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ చెప్పులు కుట్టే వృత్తి ద్వారానే కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించా. 2012లో పీయూలో అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు డాక్టరేట్ సాధించడం సంతోషంగా ఉంది. మా ఊరిలో పీహెచ్డీ డాక్టరేట్ సాధించిన ఏకైక వ్యక్తిని నేనే. మరో పదిమందికి సైతం ఉన్నత వి ద్యనభ్యసించేలా చేస్తా. సత్ఫలితాలను సాధిస్తా.
– బైరి సురేశ్, పీయూ ఫార్మసీ కళాశాల అధ్యాపకుడు