నాగర్‌కర్నూల్, జూలై 27 : గురుకులాలపై జరుగుతున్న వివక్షత, సంఘటనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని.. విద్యార్థులకు న్యాయం చేయాలని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి నాగర్‌కర్నూ ల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ శివారులో గల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థినులతో మా ట్లాడుతూ కాస్మోటిక్ చార్జీలు, దుప్పట్లు, పరుపులు అందాయా లేదా అని ఆరా తీశారు.
విద్యార్థినులు మాట్లాడుతూ బాత్రూంలు సరిగా లేవని, దు ర్గందం వస్తున్నాయని తెలిపారు. ఒక్కోసారి అన్నం లో పురుగులు వస్తున్నాయని తినకుండా పడుకుంటున్నట్లు వాపోయారు. పాఠశాల ఆవరణలోకి పాములు వస్తున్నాయని చెప్పారు. శనివారం సా యంత్రం వడ్డించిన వంటకాల గురించి ఆరా తీశా రు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కావడానికి గల కారణాలను అడిగారు. దీంతో చాలా మంది విద్యార్థినులు పులిసిపోయిన పెరుగు, ఉడికీ ఉడకని పకోడి చేశారని, దీంతో కడుపునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. కాగా, రెండు రోజుల కిందట మిగిలిన పాలలో తోడు వేయడం, సరిగా తోడుకోకపోవడంతో విద్యార్థినులకు వాంతులు, కడుపునొప్పి వచ్చినట్లు చెప్పారు.
విద్యార్థినులను పరామర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. 111మంది విద్యార్థినులు విష ఆహారం తిని దవాఖాన పాలైతే సీఎంకు కనీసం చీమకుట్టినట్లయినా లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. అందాల పోటీల్లో రూ.లక్షకు ప్లేటు భోజనం పెట్టిన రేవంత్‌రెడ్డి గురుకులాల్లో మాత్రం పాడైపోయిన ఆహారాన్ని అందిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పారని, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను పొట్టన పెట్టుకోవడమే ఆయన ఆనవాళ్లను చెరిపేయడమా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హ యాంలో నెలకొల్పిన గురుకులాలను నిర్లక్ష్యం చే స్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట గొప్పలు చెప్పడమే తప్పా ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక చోట గురుకుల పాఠశాలల్లో ఏదో ఒక ఘట న రోజూ జరుగుతూనే ఉన్నదని, గురుకుల విద్యార్థుల వార్తలు, టీవీల్లో, పేపర్లలో రాని రోజు లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. రాజకీయాలుంటే ఎన్నికల సమయంలో చూసుకోవాలే తప్పా విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో వరుస ఘటనలో జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. విద్యార్థులను పరామర్శించేందుకు తాము వస్తున్న సమాచారాన్ని తెలుసుకొని హడావుడిగా పోలీసులను పెట్టి డిశ్చార్జ్ చేయ డం, నయం కాకముందే విద్యార్థులను తీసుకెళ్లడంపై వైద్యాధికారులను ప్రశ్నించా రు. హడావుడిగా డిశ్చార్జ్ చేసిన ఓ వి ద్యార్థిని కుర్చీలో కూ ర్చోబెట్టి క్యాన్ల తీస్తుండడాన్ని గమనించి హరీశ్‌రావు వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు. నయం కాకముందే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించడంతో వైద్యులు బదులివ్వలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, గురుకులాలు అన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల పెద్దకొత్తపల్లి మం డల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని, విషపూరిత ఆహారం వల్ల విద్యార్థులు దవాఖాన పాలవుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెంలో విషాహారం తిని విద్యార్థులు దవాఖాన పాలయ్యారన్నారు. హుస్నాబాద్ బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి విద్యార్థులు దవాఖాన పాలైనట్లు వివరించారు. రాష్ట్రంలో రోజూ పేపర్లలో ఏదో ఒక గురుకుల పాఠశాల గురించి చదవాల్సి వస్తుందన్నారు.
20నెలల కాంగ్రెస్ పాలనలో వంద మంది గురుకుల విద్యార్థులు మరణించారన్నారు. వంద మందివిద్యార్థులు చనిపోయినా మీ గుండె కరగడం లేదా అని ప్రశ్నించా రు. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడం కూడా చేతకాదా అని మండిపడ్డారు. బాలల దినోత్సవం రోజున ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ జరిగితే అధికారులను సస్పెండ్ చేస్తానని ప్రగల్బాలు పలికిన రేవంత్‌రెడ్డి ఇప్పుడేమంటావని పశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు దవాఖానల పాలవుతుంటే పరామర్శించడానికి ఎందుకు వెళ్లరని అన్నా రు. 284గా ఉన్న గురుకులాలను కేసీఆర్ హ యాం లో 1,023 గురుకులాలకు పెంచారని, కాంగ్రెస్ చేసిందేమి లేకపోగా నిర్వహణ చేతకావడం లేదన్నా రు.
లక్షా 60వేల మంది ఉన్న గురుకులాల్లో కేసీఆర్ 6లక్షల మంది విద్యార్థులు చదివే సౌకర్యాలు కల్పించారన్నారు. ఓ విద్యార్థిని తల్లి రూప అనే మహిళ తనను కలిసి నిన్న పాఠశాలలో జరిగిన ఘటనను వివరిస్తూ ఆందోళనకు గురయ్యారన్నారు. తనబిడ్డ కలుషిత ఆహారం తిని దవాఖాన పాలైందని తెలిసి వచ్చినట్లు అసహనానికి లోనైనట్లు తెలిపారు. ఇంత జరిగినా ఆదివారం సాంబారు అన్నం వడ్డించగా, సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని వి ద్యార్థిని తల్లి స్వయంగా చూసి చెప్పిందన్నారు.
గురుకులాల్లో మెనూ పాటించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. నాణ్యతలేని ఆహారం తిని 100 మందికిపైపైగా విద్యార్థులు దవాఖాన పాలవడం కలిచివేసిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 6లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసి వారి జీవితాలతో రేవంత్‌రెడ్డి చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తులో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. గురుకులాల విషయం లో హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి స్పందించాలని విన్నవించారు.