గద్వాల అర్బన్, జూన్ 25 : ఎనిమిదేండ్ల బాలికపై ఓ వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీదొడ్డి మండల పరిధిలో మూడు రోజుల కిందట ఓ గ్రామంలో ఎనిమిదేండ్ల బాలిక ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన 53 ఏండ్ల వృద్ధుడు బాలికను పక్కకు తీసుకుపోయి లైంగికంగా వేధింపులకు గురిచేశాడు.
అటుగా వెళ్తున్న స్థానికు లు గమనించి ఆ వృద్ధుడి చెర నుంచి బాలికను కాపాడి వృద్ధుడికి దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు వృద్ధుడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేశారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించినట్లు కేటీదొడ్డి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.