జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 28 : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జడ్చర్లలోని విద్యాసంస్థల్లో సైన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం వారు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకున్నది. బాదేపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, ప్రయోగాలు, మూలకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. స్వా మినారాయణ్ గురుకుల పాఠశాల, వివేకానంద హైస్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు.
ఉర్దూ మీడియంలో..
హన్వాడ, ఫిబ్రవరి 28 : మండలకేంద్రంలోని ఉర్దూమీడి యం పాఠశాలలో విద్యార్థులు మంగళవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మురళీకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో..
పాలమూరు, ఫిబ్రవరి 28: మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హోమ్మేడ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. వి ద్యార్థినులు పలు ప్రదర్శనలను తయారు చేసి వాటి గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాధర్, వృక్షశా స్త్ర విభాగాధిపతి అమీనాముంతాజ్, అధ్యాపకులు సుధీర్, శ్రీవాణి, శ్వేతరాణి, త్రివేణి, విద్యార్థినులు పాల్గొన్నారు.
కేజీవీబీ పాఠశాలలో..
బాలానగర్, ఫిబ్రవరి 28: మండలకేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో మంగళవారం జాతీయ సైన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం వీడియోలను చూయించి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను వివరించారు. ‘క్వస్ట్ ఫర్ టాలెంట్’ కార్యక్రమం పేరుతో సై న్స్‌పై క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అంతకుముందు విద్యార్థులు తయారుచేసిన సైన్స్ పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తిర్మలాపూర్‌లో..
రాజాపూర్, ఫిబ్రవరి 28: మండలంలోని తిర్మలాపూర్ జి ల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ సై న్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్ జ యంతి సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్టాల్స్, మనవ శరీర భాగాల పనితీరును రంగవళ్లులతో ప్రదర్శించి వివరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సుందర్‌పాల్ మాట్లాడుతూ నేటి అధునిక జీవితంలో మానవులకు సైన్స్ విజ్ఞానం చాలా అవసరమన్నారు. విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా రాణిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బసయ్య, జయపాల్‌రెడ్డి, కేశవులు, మణి, మంజుభార్గవి, వేణుగోపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.
మిడ్జిల్‌లో..
మిడ్జిల్, ఫిబ్రవరి 28: మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రయోగాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హెచ్ఎం రవికుమార్, ఉపాధ్యాయుల శ్రీశైలం, రవిశంకర్, స్వర్ణలత, కోఠ్యానాయక్, రాజేందర్‌గౌడ్, పరశురాములు, పాషా తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండలో..
కోయిలకొండ, ఫిబ్రవరి 28 : మండలంలోని బీసీ గురుకుల పాఠశాలతోపాటు వీరభద్ర పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన చాట్స్‌ను ప్రదర్శించగా ప్రతిభ చాటిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
మూఢనమ్మకాలను తరిమేద్దాం
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 28: సైన్స్‌తో సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను తరిమికొడదామని కౌకుంట్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం అబ్దుల్ హఖ్ పిలుపునిచ్చారు. కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లోని పాఠశాలల్లో మంగళవారం జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. సీవీరామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పైస్ఎంపీపీ సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.