మహబూబ్‌నగర్, నవంబర్ 26 : భార త రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నా యకులు అంబేద్కర్ విగ్రహం, చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రా జ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఏవో శ్రీకాంత్, డీఈ శివరాం, ఏడీఈ అనంతయ్య, ఏఏవో గంగాధర్ పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
జడ్చర్ల, నవంబర్ 26 : రాజ్యాంగ నిర్మా త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొ నసాగిద్దామని జెడ్పీ వైస్‌చైర్మన్ యా దయ్య అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్చర్లలో అంబేద్కర్ వి గ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ సమన్యాయం, స్వేచ్ఛ, సమానవ త్వం అందించేందుకు రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. కార్యక్రమం లో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు జంగయ్య, ఇంతియాజ్, పి.మురళి, సతీశ్, శంకర్‌నాయక్, నాగరాజు, శ్రీనూనాయక్, కుర్మయ్య, బాలస్వామి, టీఎమ్మార్పీఎస్ రా ష్ట్ర అధ్యక్షు డు సింగిరెడ్డి పరమేశ్వర్, జంగ య్య, శ్రీను, కృష్ణయ్య, అయ్యన్న, జహంగీర్‌పాషా, యా దయ్య, వినోద్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో..
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చే యించారు. కార్యక్రమంలో ఏఎంసీ శంకర్‌సింగ్, ఏసీపీ ప్రతాప్, కౌన్సిలర్ రాము, మో సీన్ పాల్గొన్నారు. అదేవిధంగా స్టేడియంలో డీవైఎస్వో శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
పాలమూరు యూనివర్సిటీలో..
పాలమూరు, నవంబర్ 26 : పాలమూ రు యూనివర్సిటీలో వ్యాపార నిర్వహణ విభాగం, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంబీఏ జూనియర్ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌వోడీ అర్జున్‌కుమార్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ కిశోర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పాల్గొన్నారు. అదేవిధంగా ఎంవీఎస్ కళాశాలలో రాజ్యాం గ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, యువజన సంఘం అధికారి కోటానాయక్, రాఘవేందర్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, నవంబర్ 26 : మండలకేంద్రంలో ప్రజాసంఘాల నాయకులు రా జ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, సర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం ఉపాధ్యక్షుడు మెల్గర శ్రీకాంత్, పురందాస్నాయక్, రవినాయక్, శేఖర్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, నవంబర్ 26 : మండలకేంద్రంతోపాటు గోపన్‌పల్లిలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొబ్బలి ఆంజనేయులు, సింగిరెడ్డి పరమేశ్వర్, చెన్న ప్ప, రాజు, భిక్షపతి, నాగరాజు, గోపిరాజు, సదానంద్, కృష్ణ, శ్రీను, నవీన్, హర్ష, రా మాంజనేయులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, నవంబర్ 26 : మండలకేంద్రంతోపాటు తిర్మలాపూర్, ఖానాపూర్, చెన్నవెల్లి, కుచ్చర్కల్ గ్రామాల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతి జ్ఞ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింహులు, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదయ్య, సర్పంచ్ మహేశ్వరి, మాజీ సర్పంచ్ రామకృష్ణాగౌడ్, విజయకుమార్, నాగరాజు, నర్సింహులు ఉన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, నవంబర్ 26 : రాజ్యాం గ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్ ప్రేంరాజ్, ఎంపీడీవో జయరాం, ఎస్సై శ్రీనయ్య పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే పారుపల్లిలో సర్పంచ్ మాణిక్యమ్మ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘ నంగా జరుపుకొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, నవంబర్ 26 : మండలకేంద్రంతోపాటు రుద్రారం, కొల్లూరు గ్రామా ల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనం గా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం, చిత్రపటానికి పూలమాలవే సి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాం గ విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మ య్య, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, డిప్యూటీ తాసిల్దార్ లిఖితారెడ్డి, సర్పంచ్ గోపాల్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తాహేర్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, నవంబర్ 26 : భారత రా జ్యాంగాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాసిల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూ టీ తాసిల్దార్ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూత్పూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్ చెన్నకిష్ట న్న, టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, బోరింగ్ నర్సింహులు, గడ్డం రాములు పాల్గొన్నారు.
కౌకుంట్ల మండలంలో..
దేవరకద్ర రూరల్, నవంబర్ 26 : కౌ కుంట్ల మండలకేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సం దర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింహులు, చంద్రశేఖర్, కిషన్‌రావు, శేఖర్‌రెడ్డి, చందుగౌడ్, శేఖర్ పాల్గొన్నారు.