మల్దకల్, అక్టోబర్ 5 : కాంగ్రెస్ సర్కారు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి కొందరికే మాఫీ చేసి మొండిచేయి చూపించిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హన్మంతునాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేత శేఖర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సం దర్భంగా హన్మంతునాయకుడు మాట్లాడుతూ.. 9 నెలల్లోనే కాంగ్రెస్ 420 హామీలపై స్పష్టత వచ్చిందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించినా సరిపోయిన బస్సులు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల జిల్లాలో గులాబీ జెండా ఎగురవేశామని, కొందరు స్వలాభం కోసం పార్టీ మారారన్నారు.
అయినా కూడా గ్రామాల్లో బీఆర్ఎస్కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదన్నారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉం టామన్నారు. గట్టు ఎత్తిపోతల డిజైన్ మార్చాలని పార్టీ మారిన ఎమ్మెల్యే అంటున్నారని, అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కర్ణాటకకు మేలు చేసేందుకు ఇక్క డి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. కార్యక్రమం లో నాయకులు బస్వరాజు, మోనేశ్, జనార్దన్‌రెడ్డి, శేఖర్‌నాయుడు, తిరుమలేశ్, రాజు, ముని, రాము, వెంకటేశ్, బొజ్జయ్య, నాగరాజు, లోకేశ్, కామేశ్ పాల్గొన్నారు.