మాగనూరు / ఊట్కూర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ఘనంగా హనుమన్ జయంతి (Hanuman Jayanti ) వేడుకలను నిర్వహించారు. మాగనూరు కృష్ణ (Maganur) , ఊట్కూర్( Utkoor ) మండలాల్లో తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. మాగనూరు ఉమ్మడి మండలంలో వీర హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రలు నిర్వహించారు.
మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి గ్రామ పురవీధుల గుండా ప్రధాన రహదారి ఇరువైపులా హనుమాన్ దేవాలయం వరకు ఘనంగా భక్తిశ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించి అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో కే కృష్ణయ్య,పురుషోత్తం రెడ్డి , వాకిటి శ్రీనివాస్ , మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు, అశోక్ గౌడ్, తంగిడి వెంకటయ్య , రమేష్ గౌడ్ , ఉజ్జల్లి వెంకటయ్య , ముష్టి లక్ష్మన్న , వెంకటరెడ్డి , సుమంత్ , కురువ సిద్ధప్ప గడ్డం నరేష్ , వెంకటేష్ గౌడ్ , బాలుగౌడ్, ఆంజనేయులు గౌడ్, అశోక్ గౌడ్ , భరత్ కుమార్, రమేష్ , వినోద్ , వేణు , శంకర్ , అక్షయ్, శశి, భజన బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లో..
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఊట్కూర్‌లోని మెయిన్ బజార్ హనుమాన్ ఆలయం, గోశాల హనుమాన్ ఆలయంతోపాటు పగిడిమర్రి మారుతి ఆంజనేయస్వామి ఆలయం, నిడుగుర్తి, బిజ్వారం పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు విశేష అభిషేక పూజలతో పాటు పంచ కుండాత్మక హనుమాత్ కవచహవనం పూజలు, ఫల పంచామృతాలు, యజ్ఞాలు, సీతా రాముల కళ్యాణం, పల్లకి సేవ నిర్వహించారు.
ఆలయ సభ్యులు బస్వరాజ్ గౌడ్, మురళీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అశోక్ గౌడ్, బోయిని వెంకటప్ప ఆద్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ మణెమ్మ, లయన్స్ క్లబ్ జిల్లా కమిటీ సభ్యులు ఎల్కోటి జనార్ధన్ రెడ్డి, సురేష్ లింగం, పీ నారాయణ, నర్సింహా రెడ్డి, వీరేశ్ గౌడ్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.