గద్వాల, ఆగస్టు 3 : ప్రతియేటా అశ్వయుజ మాసంలో ప్రారంభమయ్యే తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు గద్వాల చేనేత పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఎందువలనంటే నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల వేంకటేశ్వరునికి ఇక్కడ నేత మగ్గంపై తయారు చేసే ఏరువాడ జోడు పంచెలను అలంకరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం గద్వాల చేనేత పరిశ్రమ చేసుకున్న పుణ్యఫలంగా కార్మికులు భావిస్తారు.
ఈ ఏడా ది సెప్టెంబర్ 22న తిరుమలలో జరిగే వార్షిక బ్ర హ్మోత్సవాల ప్రారంభం రోజు శ్రీవారికి ఏడువాడ జోడు పంచెలను అలంకరించేందుకుగానూ నిపుణులైన చేనేత కార్మికులు నా మాల మగ్గంపై అహోరాత్రులు నిమగ్నమై పంచెలు నేస్తున్నారు. శ్రావణమాసంలో జోడు పంచెల తయారీని ప్రారంభించి 41రోజుల్లో ఈ పంచెలను నిష్టతో తయారు చేస్తారు.
గద్వాల సంస్థానం నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాల కానుకగా అందే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. గద్వాల సంస్థానాధీశులు సం ప్రదాయ బద్ధంగా నేత మగ్గాలపై జో డు పంచెలను ఇక్కడి చేనేత కార్మికులచే తయారు చేయించి తిరుమల తి రుపతి దేవస్థానికి అందజేసే ఆచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే వార్షి క బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి మూల విగ్రహానికి ఏరువాడ జో డు పంచెలు అలంకరించి ప్రత్యేక పూజ లు చేసిన అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం తిరుమలలో సంప్రదాయ ఆచారంగా వస్తోంది.
ఆనాటి గద్వాల సంస్థానంలో కళలకు, కళాకారులకు ఎంతో ఆదరణ లభించింది. ఆనాటి సంస్థానాధీశులు కృష్ణరాంభూపాల్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వారిచే గద్వాల చేనేత కార్మికులకు నేత పనిలో శిక్షణ ఇప్పించి గద్వాలలో చేనేత పరిశ్రమ స్థిరపడేందుకు దోహదపడ్డారు. ప్రతి ఏటా తిరుమల తిరుపతిలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేదికగా చేసుకున్నారని ఇక్కడి చేనేత కార్మికులు అంటున్నారు.
కృష్ణరాంభూపాల్తో మొదలైన సంప్రదాయం సంస్థానాధీశులు వారసురాలైన లతాభూపాల్ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అయితే 14 ఏండ్ల కిందట కొంకతి వెంకటస్వామి కుటుంబం స్వామి తమకు పంచెలు నేసే శక్తి తమలో లేదని చెప్పగా రెండేళ్ల పాటు సంస్థానాధీశులు కోయంబత్తూర్‌లో నేయించారు. ఆ తరువార త మాజీ మంత్రి సమరసింహారెడ్డి ఇది గ్రహించి గద్వాల చేనేత కార్మికులతో మాట్లాడగా ఎవరు ముందుకు రాలేదు. అయితే సమరసింహారెడ్డి అనుచరుడైన చేనేత కార్మికుడు మహంకాళి కరుణాకర్ ముందుకు రావడంతో గత 14 ఏండ్లుగా ఆయనే పంచల తయారీకి సహకరిస్తున్నారు.
ఏరువాడ అంటే..
ఏరు అంటే నది పరివాహాక ప్రాంతం అని అర్థం. ఎరువాడ అంటే రెండు నదుల మధ్య ఉండే ప్రదేశమని అర్థం. నడిగడ్డగా పిలువబడే గద్వాల కృష్ణా-తుంగభద్ర నదుల మధ్య ఉండడం వల్ల ఈ పంచెలకు ఏరువాడ జోడు పంచెలు అనే నామం వచ్చినట్లు నానుడి. రెండు నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపై జోడు పంచెలు తయారు చేయడం సంప్రదాయం. అందుకే ఈ పంచెలు ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి పొందాయి.
నిష్టతో జోడు పంచెల తయారీ..
ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు మం డల(41 రోజులు) కాలం పడుతుంది. 41రోజుల్లో వీటిని త యారు చేయనున్నారు. శ్రావణమాసం ప్రారంభం నుంచి నా మాల మగ్గంపై నేత పనిని ప్రారంభించి ముగ్గురు(సాకే సత్య న్న, షణ్ముఖరావు, రమేశ్)చేనేత కార్మికులు సంప్రదాయబద్దంగా ఏరువాడ జోడు పంచెలు నేస్తారు. వారికి మరో నలుగురు సహకార మందిస్తున్నారు. మగ్గం నేసేటప్పుడు ఏ ఒక్క రు తప్పు చేసినా ముందుకు సాగదు. దైనందిన జీవితంలో తెలిసి తెలియక తప్పులు దొర్లితే మగ్గం దగ్గరికి వచ్చే సమయానికి ఆ విషయం తమకు పరోక్షంగా తెలుస్తుందని నేతన్నలు తెలిపారు.
జోడు పంచెలు తయారు మొదలు వా టిని తిరుమలలో అధికారులకు అందజేసేవరకు మగ్గం ఉన్న చోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం, గోవింద నామస్మర ణం చేసుకుంటూ పనికి ఉపక్రమించడం నిత్యకృత్యం. సంస్థానాధీశుల తరపున గత 14 ఏండ్లుగా ఏరువాడ పంచలను జిల్లా కు చెందిన ప్రముఖ వ్యాపారి మహాంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో నేయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జోడు పంచెలను శ్రీ వారి ఆలయ అధికారులకు అందజేస్తున్నారు. శ్రావణమాసంలో పంచెల తయారీని ప్రారంభించి తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందే వాటిని తయారు చేసి అందజేస్తారు.
జోడు పంచల విశేషం..
దేశం నలు మూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకార ప్రాయంగా ప్రత్యేక వేడుకల్లో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను మాత్రం శ్రీవారి మూల విగ్రహానికి అలంకరించడం ఈ జోడు పంచెల్లో దాగి ఉన్న విశేషం. 11 గజాల పొడవు, 85 ఇంచుల వెడల్పు, ఇరువైపులా 12 ఈంచుల బార్డర్‌తో కంచుకోట కొమ్మ నగిశీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకే సారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. ఈ జోడు పంచెలపై రాజ కట్టడాలకు గుర్తుగా కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా త యారు చేస్తున్నారు. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా సంప్రదాయ బద్ధంగా నూలు, రేషంతో జోడు పంచెలను తయారు చేస్తున్నారు.