గద్వాల, ఆగస్టు 7 : గద్వాల జిల్లా కేంద్రం లో బుధవారం నిర్వహించిన చేనేత ఫ్యాషన్‌షో ఆకట్టుకున్నది. డిగ్రీ, జూనియర్ కళాశాల వి ద్యార్థినీ, విద్యార్థులు చేనేత వస్ర్తాలు ధరించి నిర్వహించిన ర్యాంప్‌వాక్ అదుర్స్ అ నేలా సాగింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముం దు అంబేద్కర్ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు, చే నేత కార్మికులు, కళాకారుల బృందంతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చేనేత వస్ర్తాలు ధరిస్తామ ని, అందరూ వేసుకునేలా కృషి చేసి వారసత్వకళారంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సంతోష్ మాట్లాడు తూ యువత చేనేత వస్ర్తాలను ధరించి సాంస్కృతిక వారసత్వ సంపదను, చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. పవర్లూమ్ కంటే చేతి పనితో చేసే వస్ర్తాలు ఎంతో గొప్పవన్నారు. కార్మికుల నైపుణ్యాన్ని ప్రజలకు చాటి చెప్పి అందరూ చేనేత వస్ర్తాలు ధరించేలా ప్రోత్సహించాలని సూచించారు. గద్వాల చీరల గొప్పతనాన్ని కలెక్ట ర్ వివరించారు. చేనేత వృత్తిని, నైపుణ్యాన్ని యు వత తెలుసుకొని నేర్చుకోవాలన్నారు. గద్వాల చేనేత వస్ర్తాలను అమోజాన్, ఫ్లిప్‌కార్ట్, మిత్రా వంటి ఆన్లైన్ షాపింగ్ ద్వారా ప్రపంచ వ్యా ప్తంగా మార్కెటింగ్ చేసి అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు.
ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ ప్రపంచంలో నే గద్వాల చీరకు ఒక ప్రత్యేకత ఉండడం గర్వకారణమన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి చేనేత పార్కు ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నేత కార్మికులను, ఫ్యాషన్‌షో లో పాల్గొన్న విద్యార్థినులకు, బ్యాంకర్లకు మె మోంటో, సర్టిఫికెట్లు అందించి ఘనంగా సన్మానించారు. పావలా వడ్డీ రుణాల చెక్కును అం దజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, చేనేత అధికారి గోవిందయ్య, నేత కార్మికులు రామలింగేశ్వర కామ్లేతోపా టు పలువురు పాల్గొన్నారు.