కోస్గి, నవంబర్ 9 : ఎస్జీఎఫ్ 69వ అండర్-17 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం మధ్యాహ్నంతో ముగిశాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి క్రీడాకారులు ప్రతిభ కనబరిచి క్రీడా స్ఫూర్తిని చాటారు. బాలికల విభాగంలో అదిలాబాద్ 16-07 పాయింట్లతో మహబూబ్‌నగర్‌పై విజయం సాదించింది. మహబూబ్‌నగర్ జట్టు రెండో స్థానంలో నిలవగా, కరీంనగర్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మరో వైపు శనివారం ఫ్లడ్ లైట్ల సమస్యతో బాలుర సెమీ ఫైనల్ మ్యాచ్ నిలిచిపోగా, ఆదివారం కొనసాగించారు.
బాలుర ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్-మహబూబ్‌నగర్ జట్ల మధ్య జరగగా, వరంగల్ 22-15 పాయింట్లతో మహబూబ్‌నగర్‌పై గెలుపొందింది. మహబూబ్‌నగర్ జట్టు రెండో స్థానంలో నిలవగా, కరీంనగర్ జట్టు మూడోస్థానంలో నిలిచింది. అనంతరం నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. మహబూబ్‌నగర్ బాలికల జట్టు తరఫున అత్యుతమ ప్రతిభ కనబరచిన క్రీడాకారిణి రష్మికను జర్నలిస్టులు సన్మానించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, పీడీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.