ఊటూర్, నవంబర్ 11 : తెలంగాణ కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఇండస్ట్రీ యజమానులు సోమవారం పత్తి కొనుగోళ్లను నిలిపి బంద్ పాటించారు. మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద ఏర్పాటైన లక్ష్మీదుర్గ ఆంజనేయ కాటన్ మిల్లు, లింగంపల్లి సమీపంలోని సిద్దివినాయక కాటన్ ఇండస్ట్రీ, ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లి శివారులోని విజయ కాటన్ ఇండస్ట్రీ, తిమ్మారెడ్డిపల్లితండా వద్ద ఉన్న మారుతి ఆగ్రో ఇండస్ట్రీ, ధన్వాడ మండలం లింగంపల్లి వద్ద ఉన్న భాగ్యలక్ష్మి పత్తి మిల్లు యాజమాన్య సంస్థలు పత్తి కొనుగోళ్లను నిలిపి సంపూర్ణ బంద్ పాటించారు. దీంతో ఆయా ఇండస్ట్రీల వద్ద పత్తి కొ నుగోళ్లు నిలిచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పొద్దస్తమానం వాహనాలతో పడిగాపులు కాచారు. అర్ధరా త్రి వేళ ఇండస్ట్రీల వద్దకు చేరుకుని వాహనాలను క్యూలో నిలిపిన రైతులు సోమవారం ఉదయం 10 దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వాహనాల అద్దె తమకు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికి గిట్టుబాటు ధరలు రావడం లేదని, మరో పక్క కొనుగోళ్లు నిలి చి అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదన్నారు. ఇండస్ట్రీ యజమానుల సమ్మెతో కొనుగోళ్లు ఆలస్యం అవుతాయని కొం దరు రైతులు కర్ణాటక రాయిచూర్లో పత్తి అమ్ముకునేందు కు తరలించారు. కాగా, సీసీఐ ఎల్1, ఎల్2, ఎల్3 పేరు తో కొత్త నిబంధనలను అమలు చేయడంతో కొనుగోళ్లకు సీజన్ దాటి పోతుందని, ఎల్2, ఎల్3 మిల్లులు మూత పడే పరిస్థితి ఉందని ఇండస్ట్రీ యజమానులు చెబుతున్నా రు. ప్రభుత్వం నిబంధనలను ఎత్తి వేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, మధ్యా హ్నం 2 తర్వాత సీసీఐ సీఎండీతో రాష్ట్ర కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జరిపిన చర్చలు సఫలమైనట్లు సమాచారం రావడంతో యథావిధిగా కొగోళ్లను ప్రారంభిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించారు.
అలంపూర్ చౌరస్తా, నవంబర్ 11 : పత్తి కొనుగోలు కేంద్రాలు సోమవారం నుంచి బంద్ కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు ని బంధనలు విధించడంతో ఉండవల్లి మం డలంలోని జాతీయ రహదారిపై ఉన్న వ రసిద్ధి వినాయక కాటన్ మిల్లులో పత్తిని కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ విషయం తెలియని రైతులు శనివారం నుంచి ఆటో లు, ట్రాక్టర్లలో వేల క్వింటాళ్ల పత్తిని మి ల్లు వద్దకు తీసుకొచ్చారు. సమ్మె విరమిస్తేనే కొనుగోలు చేస్తామని యాజమాన్యం చెప్పడంతో రైతులు నిరాశకు లోనయ్యా రు. వందల వాహనాల్లో పత్తిని నింపుకొని మిల్లు వద్దకు వచ్చామని, ఇప్పుడు కొనుగోలు చేయడం లేదని చెబితే ఎక్కడి వెళ్లాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి వాహనా ల్లో పత్తిని తొక్కి ఉంచామని పత్తి చెడిపోతుందని ధర పలకకపోతే నష్టపోతామని, వాహనాల కిరాయిలు కూడా కట్టాలని, అధికారులు స్పందించి పత్తిని కొనుగోలు చేయాలని రైతులు కోరారు.
పత్తిని కొనుగోలు చేస్తామని టోకన్లు ఇవ్వడంతో వాహనాల్లో తీసుకొచ్చాం. మిల్లు వద్దకు వస్తే కొనుగోలు చేయడం లేదని యా జమాన్యం అంటున్నది. అలాంటప్పుడు టోకెన్లు ఎందుకు ఇ చ్చారు. మాకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే తీసుకొచ్చే వాళ్లం కాదు కదా. కిరాయిలు మీద పడేవికావు.
రెండెకరాల్లో పత్తి సాగు చేశా. అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది. ఈ ఏడా ది పత్తికి ధరలు లేకపోవడంతో పెట్టుబడి సైతం చేతికి అందే పరిస్థితి లేదు. అర్ధరాత్రి ట్రాక్టర్ లోడుతో వచ్చి ఇక్కడే పడుకున్న. మధ్యాహ్నం 2 గంటలు గడిచినా కొనలేదు. సమ్మె చేస్తున్నట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. తిండికి సైతం తిప్పలు పడుతున్నం.
దళారులను నమ్మి మోసపోవద్దన్న అధికారుల మాటలు విని సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చాను. రెండ్రోజులైంది.. కొంటరో లేదో కూడా చెప్పడం లేదు. ఇక్కడి కి తీసుకురాకుంటే వచ్చిన కాడికి ఎవరికో ఒకరికి అమ్ముకునేటోళ్లం. తిండీ తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నాం. సతాయిస్తే కేంద్రాలకు ఎవరూ రారని ఉల్టా తి ప్పలు పెడుతున్నారేమో..?