మహబూబ్‌నగర్ విద్యావిభాగం, డిసెంబర్ 12 : మరో రెండు, మూడునెలల్లో ఇంటర్, టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన సమ యం.. ఇది విద్యార్థుల భవిష్యత్‌కు కీలక సమయం. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం చేసిన తప్పిదంతో విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతోపాటు సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో వారంతా హామీలు నమ్మి ఓటు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలన పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను మాత్రం ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఎన్ని విజ్ఞప్తులు, ధర్నాలు చేసినా స్పందించక పోవడంతో విసుగు చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు ప్రభుత్వ మెడలు వంచైనా సరే.. హామీలను అమలు చేయించాలని సంకల్పించారు. ఇందుకు అల్టిమేటం జారీ చేశారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారు.
సమ్మెతో చదువులకు దూరం
సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మెతో కేజీబీవీలు సహా ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో బోధన బంద్ అయ్యింది. సమ్మె కారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో పాఠ్యాంశాల బోధనకు అంతరాయం కలుగుతోంది. పాఠాలు చెప్పడం పూర్తిగా బంద్ చేశారు. కేవలం కొందరు సిబ్బంది వంట చేసి పిల్లలకు పెడుతున్నారు. దీంతో విద్యార్థులు హాస్టల్ గదులకే పరిమితమయ్యారు. కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 20వేలకు పైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. తాజాగా ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఉద్యోగుల సమ్మెతో వీరి విద్యాబోధనకు అంతరాయం ఏర్పడింది.
సర్కారు దిగివచ్చేదాక సమ్మె
గతంలో 3 రోజులపాటు ధర్నాలు చేసినా సర్కా రు పట్టించుకోలేదు. ఈసారి ప్రజాపాలన ప్రభు త్వం దిగి వచ్చే దాకా సమ్మెను కొనసాగిస్తామంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. మూడు రోజులుగా కొనసాగుతున్న వీరి సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఉపాధ్యాయ సం ఘాలు సైతం వారికి మద్దతిస్తున్నా యి. దీంతో సర్వశిక్షా ఉద్యోగులు స మ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల స మ్మెతో మండల విద్యావనరుల కేంద్రా లు సైతం వెలవెలబోతున్నాయి. జిల్లాలోని ప్రతి మండలానికి ఒక ఎమ్మార్సీ ఉంది. ఇందులోని ఉద్యోగులంతా కాం ట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నవారే. ఇప్పు డు వీరంతా సమ్మెలో ఉండడంతో ఎమ్మార్సీల కు తాళాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఇన్చార్జీలు మాత్రమే విధుల్లో ఉండడంతో వారు సొంత స్కూళ్లకు వె ళ్లి పాఠశాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది.
జిల్లాల వారీగా కేజీబీవీలు, విద్యార్థినులు
మహబూబ్‌నగర్ జిల్లాలో 14 కేజీబీవీ లు ఉండగా.. 4,149 మంది విద్యార్థినులు ఉన్నారు. జోగుళాంబ-గద్వాల జిల్లా లో 12 కేజీబీవీల్లో 3,501 మంది, నాగర్‌కర్నూల్‌లో 20 కేజీబీవీల్లో 5,525 మంది, నారాయణపేటలో 11లో 3,344 మంది, వనపర్తి జిల్లాలో 15 కేజీబీవీల్లో 3,710 మంది విద్యార్థినులు ఉన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇలా..
సమగ్ర శిక్ష అభియాన్ కింద కేజీబీవీలు, యూఆర్ఎస్, ఆశ్రమ పాఠశాలలు, మైనారిటీ గురుకులం, జిల్లా విద్యాశాఖ, మండల వి ద్యాధికారి కార్యాలయాలు, భవిత కేంద్రాలు, మం డల రీసోర్స్ కేంద్రం, ఆర్ట్స్, క్రాప్ట్స్ టీచర్స్, సీఆర్ పీ తదితర 13 విభాగాల్లో పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 600మంది, గద్వాలలో 430, వనపర్తిలో 513, నాగర్‌కర్నూల్‌లో 750, నారాయణపేట జిల్లాలో 380 మంది పనిచేస్తున్నారు.
ఎంఈవో గురుతర బాధ్యత
ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెతో విద్యార్థినులకు పాఠాలు
ధరూరు, డిసెంబర్ 12: మండల వనరుల కేంద్రంలోని సర్వశిక్ష ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో మండల విద్యాధికారి ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధించాడు. ఎమ్మార్సీ కార్యాలయానికి ఎవరూ రాకపోవడంతో కేజీబీవీ టీచర్లు కూడా సమ్మెలో పాల్గొనడానికి వెళ్లగా.. గురువారం ఎంఈవో రవీంద్రబాబు కార్యాలయానిక తాళం వేసి, మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు పాఠాలు చెప్పాడు. ఇలా అయితే కస్తూర్బా విద్యార్థినుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది.