ఊట్కూర్ : గురు పౌర్ణమి ( Guru Pournami ) సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం అంబత్రయ క్షేత్రంలో ( Ambatraya Kshetra ) ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన భక్తులు పాల్గొని గురూజీ ఆదిత్య పరాశ్రీ ఆశీర్వాదం పొందారు. భక్తులను ఉద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ప్రగతిపథంలో నడిపించేవాడు గురువన్నారు. అలాంటి గురువులను ఆరాధించడం కోసమే గురు పౌర్ణమి జరుపుకుంటారని తెలిపారు. భక్తులు భజనలు, కీర్తనలతో ఆకట్టుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.