నారాయణపేట, ఏప్రిల్ 28 : పేట పట్టణానికి చెందిన మానసవీణ కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ వరల్డ్ నుంచి మెడల్, ప్రశంసాపత్రం అందుకున్న ది. 2023 డిసెంబర్ 23వ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూచిపూడి లార్జెస్ట్ లెసన్ కార్యక్రమం ని ర్వహించారు.
ఇందులో దేశంలో ని వివిధ రాష్ర్టాలకు చెందిన 4,768 మంది కూచిపూడి కళాకారులు పా ల్గొనగా.. వీరిలో నారాయణపేటకు చెందిన మల్లికార్జున్, రజిత దంపతుల కూతురు మానసవీణ ప్ర తిభ చాటింది. ఇందుకుగానూ గిన్నిస్ బు క్ వరల్డ్ నుంచి మెడల్, ప్రశంసా పత్రాన్ని పోస్టు ద్వారా అందుకున్నది.