గద్వాల, నవంబర్ 23 : ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభు త్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీల మేరకు దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు పెంచాలంటూ కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పో రాట సమితి నాయకులు శనివారం ధర్నా నిర్వహించారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు రాజేశ్, పరశురాముడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు హనుమంతునాయుడు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కుర్వ పల్ల య్య మాట్లాడారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు, 3వేలకు పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దన్నారు.
ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. పింఛన్ పెంపు లేకపోగా.. ఉన్న పింఛన్లు ఎప్పుడు వస్తున్నాయో తెలియని పరిస్థితి నెల కొందన్నారు. పింఛన్ పెంపు చేయకుండా దివ్యాంగులతోపాటు ఇతర పింఛన్‌దారులను సీఎం మోసం చేశాడని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు తక్షణమే రూ.6వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పిం ఛన్ డబ్బులను పక్కదా రి పట్టిస్తుందని ఆరోపించారు.
దివ్యాంగులకు లో న్లు, వాహన పరికరాలు అం దజేయకుండా ఇ బ్బందులకు గురి చే స్తున్నారని ఆరోపించా రు. దివ్యాంగులకు సంబంధించి రూ. 9వేల కోట్ల బడ్జెట్‌ను వారి కి కాకుండా చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దివ్యాంగులతోపాటు పింఛన్‌దారులను గాలికి వదిలేశారన్నారు. రేవంత్ సర్కార్ వికలాంగ సమాజంపై చిన్నచూపు చూస్తుందన్నారు. వారి సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం వెంటనే స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పింఛ న్ పెంపుపై ఇచ్చిన హామీ వెంటనే నిలుపు కోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో వీరభద్రప్ప కు వినతిప్రతం అందజేశారు. ధర్నాలో ఎమ్మార్పీఎస్ నా యకులు రంజిత్, అశోక్, ఆంజనేయులు, హ నుమంతు, మైనార్టీ నాయకులు అతికూర్రెహమాన్, మక్బూల్, హరీఫ్ తదితరులు పాల్గొన్నారు.