మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబర్ 18 : గ్రూప్-3 పరీక్షలకు సగం మంది అభ్యర్థులు దూరంగా నే ఉండిపోయారు. గతంతో పోలిస్తే అభ్యర్థుల హాజరు భారీగా తగ్గింది. ఆదివారం నిర్వహించిన పేపర్-1, పేపర్-2కు సకాలంలో హాజరుకాని వివరాలు వెల్లడించిన అధికారులు సోమవారం జిల్లాలో ఎంతమంది హాజరయ్యారన్న వివరాలను వెల్లడించలేదు. హాజరు శాతాన్ని వెల్లడించేందుకు టీజీపీఎస్సీ అధికారుల అనుమతి ల భించలేదని తెలిపారు.
మొత్తం 1,365 గ్రూప్-3 పోస్టు ల భర్తీకి గానూ రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 3 పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50,025 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి లో సగం మంది మాత్రమే పరీక్షలకు హాజరు కావడం విశేషం. సోమవారం ఉదయం 10గంటల నుంచి మ ధ్యాహ్నం 12:30గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మొత్తం 52 పరీక్షా కేంద్రాల్లో 19,465 మంది పరీక్షలు రాయా ల్సి ఉండగా, 55 శాతం మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.
మొదటి రోజు పేపర్-1, పేపర్-2 పరీక్ష రాసిన వారిలోనూ కొందరు పేపర్-3 రాయలేదు. ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద హాల్‌టికెట్ మ ర్చిపోయి ఒకరు నిరాశగా వెనుదిరిగారు. బాలికల జూనియర్ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థి నిర్దేశిత గడువు ముగియడంతో వెనుదిరిగాడు. ఎస్పీ జానకి మహబూబ్‌నగర్ పట్టణంలోని మహాత్మాగాంధీరోడ్ ఉ న్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్‌కుమార్ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల వద్ద పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెంట ర్ల వద్ద 163 బీఎన్ఎస్ సెక్షన్ అమలు చేసి భద్రతా ఏ ర్పాట్లు పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.