ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పరిశీలించారు. వనపర్తి జిల్లాలో 31 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్ 3కు 8,669 మందికి గానూ 4,382 మంది, పేపర్-4కు 4,281 మంది హాజరయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 25 కేంద్రాల్లో 8,722 మందికి గానూ పేపర్-3, పేపర్-4కు 48 శాతం హాజరయ్యారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 20,584 మందికి 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా రెండు సెషన్స్‌లో కలిసి 50 శాతానికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. నారాయణపేట జిల్లాలో 3,994 మందికిగానూ 13 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం 2,015.., మధ్యాహ్నం 2,016 మంది పరీక్ష రాశారు. నాగర్కర్నూల్జిల్లాలోని 32 పరీక్షా కేంద్రాల్లో 9,731 మందికి గానూ పేపర్-3, పేపర్-4కు 4699 మంది అభ్యర్థులు హాజరు కాగా 5032 మంది గైర్హాజరు కాగా 48శాతం హాజరుశాతం నమోదైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.
– నెట్వర్క్ నమస్తే తెలంగాణ, డిసెంబర్ 16