నాగర్కర్నూల్, ఫిబ్రవరి 12 : ఈ ఏడాది వేరుశనగ రైతులకు భంగపాటు తప్పలేదు. యా సంగి సీజన్లో పంట సాగైనా దిగుబడి ఆశిం చిన స్థాయిలో రాలేదు. వచ్చిన కొద్దిపాటి దిగు బడికి ధరల్లేక నష్టాలపాలయ్యారు. తెగుళ్ల బారి నుంచి గట్టెక్కినా ఏదో విధంగా.. కొద్దో.. గొ ప్పో పండించిన పంటకు సై తం మద్దతు ధర దక్క లే దు. పెట్టుబడులు ఎల్లక దిగాలు చెందారు. వర్షా కాలంలో రైతులు సా గు చేసిన పంట చేతికి వచ్చే స మ యానికి అతి వృష్టి లేదా.. అనా వృష్టి కారణంగా, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే కా నీ దిగుబడిని పొం దలేకపోయారు. ఈ యాసంగి పంట తోనైనా సరైనది గుబడి పొంది.. అ నుకూలమైన ధర వస్తుందని ఆశ పడి న రైతులకు అడి యాశలే మిగిలాయి. చేతికి వచ్చిన పంటను మా ర్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తే పెట్టుబడి ఖర్చులు రావడం లేదు. రైతు కష్టాన్ని ఓర్చుకొని పక్కన పెట్టినా పంట పండించేందుకు చేసిన ఖర్చులు పోను రైతుకు మిగిలింది లేదు. రాత్రింబవళ్లు కష్టించి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట దిగుబడి రాక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటను మార్కెట్కు తెస్తే సరైన ధర లేక, పెట్టుబడి ఖర్చులు ఎల్లక ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు.
యాసంగిలో 1.20 లక్షల ఎకరాల్లో..
ఈ యాసంగిలో నాగర్కర్నూల్ జిల్లాలో 1.20 లక్షలకుపైగా వేరుశనగ పంట సాగైంది. వేసిన చోట్ల దిగుబడి లేక పలువురు రైతులు దిగాలు చెందు తున్నారు. ఓవైపు పంట దిగుబడి రాక.. మరోవైపు సరైన మద్దతు ధర అందక నిరాశతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్వింటాలుకు 5 నుంచి 6 వేలు మధ్యలోనే ధర పలకడంతో రైతు లు దిగుబడి వచ్చిన కొద్దిపాటి పంటలను సైతం ఏదో ఒక ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో కనీసం 8 నుంచి 9 వేలకుపై చిలుకుగా ఉన్న పల్లీ ధరలు ఈసారి పూర్తిగా తగ్గి పోయాయి. ఈసారి గరిష్ఠ ధర కేవలం రూ.7 వేలు దాటలేదంటే రైతుకు ఎంత మాత్రం గిట్టుబాటు కాలేద న్నది అర్థ మ వుతోంది. ఇదేకాక ప్రతిసారి మాదిరి ఈసారి మా ర్కెట్లలోనూ రైతులకు అన్యాయం జరు గుతోంది. తేమ, తరుగు పేరుతో రైతులకు నష్టా న్ని చే కూరుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కో బస్తాలో 30 కిలోల చొప్పున నింపు తున్న క్రమంలో.. ప్రతి బస్తాలో దాదాపు అర్ధ కిలో పల్లీలు తరుగు పేరుతో ఎక్కువ తూకం వేస్తూ వ్యాపారులు మోసం చేస్తున్నారని పలువు రు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మోసం జరుగుతున్నా పెట్టుబడి ఖ ర్చులకు సేట్లనే నమ్ముకొని పిండి సం చులు, ఇతర మందులు, పెట్టు బడి ఖర్చులు తీసుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో పెట్టుబడి సాయం చేసిన వ్యాపారుల కే పం టను అమ్ము కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
పెట్టుబడి ఖర్చులు ఎల్లలే..
మూడు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశా.. పెట్టుబడి ఖర్చులు కూడా ఎల్లలేదు. కష్టంపోనూ.. అన్ని ఖర్చులు తీసేసినా.. ఎంతో కొంత లాభం వస్తుందనుకున్నా.. కానీ పూర్తిగా దిగుబడి రాలేదు. మార్కెట్లో మద్దతు ధర కూడా అంతంతగానే ఉన్నది. గతంలో దిగుబడితోపాటు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు క్వింటాకు ధర ఉండేది. ఈసారి రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రమే దక్కింది. నేను చేసిన కష్టం ఒట్టిగనే పోయింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించి ఉంటే సేట్లతో కాకుండా పంటను కాపాడుకునేందుకు పిండి సంచులు, మందులు బయట తెచ్చుకునేటోళ్లం.
– వెంకటయ్య, రైతు, నాగర్కర్నూల్ జిల్లా