రికార్డు ధరలు పలుకుతున్న వేరుశనగ
వేరుశనగకు బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేరుశనగకు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
- బాదేపల్లి మార్కెట్లో క్వింటాకు రూ.8,506
జడ్చర్ల, జనవరి 23: వేరుశనగకు బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేరుశనగకు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం మార్కెట్లో వేరుశనగ క్వింటాకు రూ. 8,506 ధర పలికింది. బా దేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం వేరుశనగ, మొక్కజొన్న, ధాన్యం, పెబ్బర్లు, కందులు, ఉలువలు, సన్ఫ్ల్లవర్, ఆముదాలు, అమ్మకానికి వ చ్చాయి. మార్కెట్‌కు 949 క్వింటాళ్ల వేరుశనగ రాగా క్వింటా కు గరిష్ఠంగా రూ.8,506, కనిష్ఠంగా రూ. 5,602, మధ్య స్థంగా రూ.7,651 ధర పలికింది. 14క్వింటాళ్ల హంస ధా న్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 2,151ధర వచ్చింది. 174 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా క్విం టాకు గరిష్ఠంగా రూ.8,506ధర పలికింది. 98క్వింటాళ్ల మొ క్కజొన్న అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 2, 277 ధర వచ్చింది. 3క్వింటాళ్ల ఉలువలు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.5,069 ధర వచ్చింది. 3 క్వింటాళ్ల ఆముదా లు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 6, 214ధర వచ్చింది. 14 క్వింటాళ్ల సన్ఫ్ల్లవర్ అమ్మకానికిరాగా క్విం టాకు గరిష్ఠంగా రూ. 5,230 ధర వచ్చింది.
మార్కెట్‌ను సందర్శించిన చైర్మన్
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును సోమవారం మా ర్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి సందర్శించారు. మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పంట ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని, గిట్టుబాటు ధరలు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు నాణ్యతగా తీసుకురావాలన్నారు. మార్కెట్లో ఎన్నడూ లేనివిధంగా వేరుశనగకు ధరలు వస్తున్నాయన్నారు. మార్కెట్లో ఎలాంటి సమ స్య లు ఉన్నా నేరుగా తెలియజేయాలని సూచించారు. చైర్మన్ వెంట కార్యదర్శి నవీన్‌కుమార్, రఘు, ఖరీదుదారులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

