ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్న పొర్ల( Chinnaporla) జడ్పీ ఉన్నత పాఠశాల 2010-11 ఎస్ఎస్సీ బ్యాచ్( SSC Batch) పూర్వ విద్యార్థుల ( Alumni ) సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 15 ఏళ్ల అనంతరం ఒకే చోట కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన రిటైర్డ్ జీహెచ్ఎం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు విజయశ్రీ, చందూలాల్, రఘువీర్, శ్రీనివాస్, రాజగోపాల్, రవికుమార్, మౌలాలిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు.