మరికల్ : మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో ఎల్లమ్మ పసుపు బండారు ఉత్సవాలను ( Bandaru Utsavam ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ పుటం ఏర్పాటుచేసి బైండ్ల వారి పాటలతో అమ్మవారిని శాంతింప చేశారు. మహిళలు పూనకంతో ఊగిపోయారు. అనంతరం ఒకరిపై ఒకరు పసుపు చల్లుకొని పసుపు బండారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకునే బండారు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు యువకులు, తరలివచ్చారు.