మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 30 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఎంబీబీఎస్ పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడారు. భవిష్యత్ డాక్టర్లందరికీ హృదయపూర్వక అభినందనల తెలిపి, వారి సేవలు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో కాంటినెంటల్ దవాఖాన చైర్మన్ డాక్టర్ గురు ఎన్రెడ్డి, మెడికల్ కళాశాల చైర్మన్ కనకరాజు, సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ అండ్ అదనపు రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణారెడ్డి , రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, డాక్టర్ హరిప్రసాద్రెడ్డిలు కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్ డాక్టర్లను ప్రతిఒక్కరూ అభినందించారు.