మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 24 : అనాథ బాలబాలికల వసతి గృహంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం ఏనుగొండలోని రెడ్‌క్రాస్ సన్నిధి అనాథాశ్రమంలో అనాథ పిల్లల సమక్షంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థి కుమారి ఊర్మిలకు రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. మంత్రి జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్యలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వరమ్మ, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, కోశాధికారి జగపతిరావు పాల్గొన్నారు.
భూత్పూర్, జూలై 24 : మంత్రి కేటీఆర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేక్‌కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, మత్స్యసహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, కోఆప్షన్లు అజీజ్, జాకీర్, ముడా డైరెక్టర్ సాయిలు, పట్టణాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, నాయకులు గోప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, నర్సింహులు, రాములు, రాకేశ్, ప్రేమ్‌కుమార్, వెంకటయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
హన్వాడ, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకు లు కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, ఉప సర్పంచ్ గంగాపూరి, నాయకు లు జంబులయ్య, శ్రీనివాసులు, నరేందర్, మాధవులుగౌడ్, సత్యం, యాదయ్య, శేఖర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
కోయిలకొండ, జూలై 24 : మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ పీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య కేక్‌కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయ రాం, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్య, భీంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవి, లక్కీగౌడ్, మొగులయ్య, మహమూద్, ఖాజామైనోద్దీన్ పాల్గొన్నారు.
దేవరకద్ర, జూలై 24 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నా యకులు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిరుపేదలకు ఎంపీపీ రమాదేవి, పార్టీ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు పేదలకు గోడ గడియారాలు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని గూరకొండ గ్రామ సమీపంలోని బండర్‌పల్లి చెక్‌డ్యాం వద్ద కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో దేవరకద్ర సహకర సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, శివనంద్, కొండారెడ్డి, సత్యంసాగర్, యుగేందర్రె డ్డి, గోపాల్, రాము, ఆనంద్ నాయక్, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
మిడ్జిల్, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ శ్రేణులతో కలిసి ప్రజాప్రతినిధులు కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖాబాలు, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నా యకులు సుధాబాల్రెడ్డి, బాలు, గంజిశేఖర్, సత్యంగుప్తా, నవీనాచారి, ఆచారి, సుకుమార్, జగన్‌గౌడ్, బంగారు, వెంకట య్య, గోపాల్, తిరుపతినాయక్, జగన్, నర్సింహా, తిరుపతయ్య, విజయ్‌నాయక్, మల్లేశ్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట), జూలై 24 : చిన్న చింతకుంట, కౌకుంట్ల మండల కేంద్రాల్లో సోమవారం మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మండల నాయకులు కలిసి కేక్‌కట్ చేశారు. దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యాకోబ్, వెంకటేశ్, సాయిలు, అనిల్, కురుమూర్తి, రియాజ్, గంగాధర్, చాంద్‌పాషా, ఆల యువసేన నాయకులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), జూలై 24 : అడ్డాకుల మండల బీ ఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల ను సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఉన్నత పా ఠశాల ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, నాయకులు మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చై ర్మన్ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, సర్పంచ్ గోపాల్గౌ డ్, యాదయ్య యాదవ్, మండల కోఆప్షన్ సభ్యుడు తాహేర్, నాయకులు నర్సింహులు, ఫయాజ్, గిరియాదవ్ పాల్గొన్నారు.