మహబూబ్‌నగర్ జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వం గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు నిలదీతలు.. నిరసనల మధ్య కొనసాగుతున్నా యి. గ్రామసభ ప్రారంభం కాగానే జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్హుల జాబితాలను గ్రామసభలో ఆమోదించాల్సి ఉండగా ఆ జాబితాలను పక్కకుపెట్టి కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల అర్హుల జాబితాలు గ్రామసభలో ప్రకటిస్తున్న జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. దీంతో భయపడిపోయిన అధికార యం త్రాంగం అర్హుల జాబితాలను తొక్కిపెట్టి తూతూ మంత్రంగా గ్రామసభలను నిర్వహిస్తోంది.
గురువారం జరిగిన గ్రామసభలు గరంగరంగా సాగాయి. మూడో రోజు జరిగిన సభలకు హాజరైన ప్రజలు ప్ర భుత్వ పథకాల జాబితాల్లో అర్హుల పేర్లు లేవని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనర్హులకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. పలు చోట్ల జాబితాలు కూడా తారుమారైనట్లు ఆరోపించారు. దీంతో ఎక్కడ చూసినా నిలదీతలు.. నిరసనలే కొనసాగాయి. సభలు ప్రారంభం కాగానే అధికారులపై జనం ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో సభలన్నీ ఆందోళనలతో అట్టుడికిపోయాయి. మ హబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో ఏకంగా అధికారులను జ నం బండబూతు లు తిట్టినంత పని చేశారు. దేవరకద్రలో గ్రామ సభకు వచ్చిన అధికారులను వెనక్కి పంపించారు.
మరికొన్ని చోట్ల గ్రామసభలు వద్దు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించిన గ్రామా ల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. చివరిరోజు శుక్రవారం మరిన్ని ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు ఒకటి రెండు గ్రామసభలకే పరిమితం అవుతున్నారు. విపక్ష ప్రజాప్రతినిధులను గ్రా మసభలను ఆహ్వానించడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, కరెంట్ బిల్లులు, వంట గ్యాస్ సబ్సిడీ, కొత్త రేషన్ కార్డు జారీ, రూ.4 వేల పింఛన్‌పై అధికారులను కడగిపడేశారు. కౌకుంట్ల మండలం రేకులపల్లిలో గ్రామస్తుల ఆగ్రహానికి అధికారులు వెనుదిరిగారు.
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యేను నిలదీయడంతోపాటు పథకాలపై లొల్లి జరిగింది. మద్దూరు మండలం మోమినాపూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేత ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. మాగనూరు మం డలం నేరెడుగంలో ఏకంగా గ్రామసభను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. గద్వాల జిల్లా అయిజ ము న్సిపాలిటీలో గ్రామ సభను బహిష్కరించారు. నవాబ్‌పేట మండలం దొడ్డిపల్లి ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్(మేట్) పిచ్చకుంట్ల చంద్రయ్యపై దాడి జరిగింది. ఆయన ఆత్మీయభరోసా, రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా అదే గ్రామానికి చెందిన కొందరు అనర్హుల పేర్లు రాశారని, నిజమైన లబ్ధిదారులకు మొండిచేయి చూపారంటూ తీవ్ర ఆగ్రహానికి గురై ఫీల్డ్‌అసిస్టెంట్‌పై దాడి చేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.
గ్రామసభల్లోని దరఖాస్తులు
ప్రభుత్వం ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలకు గ్రామసభల్లోని పెద్ద ఎత్తున జనం దరఖాసులు చేసుకుంటున్నారు. తమకు గ్యారెంటీ స్కీములు వస్తాయో ? రావో? అన్న అనుమానంతో ప్రజలు ఆధార్ కార్డులు జిరాక్స్ పేపర్లతోపాటు రేషన్ కార్డులు ఇతర వాటికోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. కాగా గ్రామసభల్లో దరఖాస్తులు చేస్తున్నప్పటికీ అవి పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనేది అనుమానంగా మారింది. మరోవైపు ఈ పథకాలాన్నీ ఈనెల 26 నుం చి అమలు చేస్తామని చెబుతుండడంతో రెండు రోజుల్లోనే అర్హులైన వారికి ఈ పథకాలు అందజేస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు ఎమ్మెల్యేలు అ ర్హులకే కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొత్తంపైన ప్రభుత్వం చేపట్టిన గ్యారెంటీ స్కీములకు గ్యా రెంటీ లేకుండా పోయిందని జనం పెదవి విరుస్తున్నారు.
Mahabubnagar2
పోలీసు పహారా మధ్య..
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ పార్టీ వాటి అమలుకు దాదాపు 15 నెలల తర్వాత ఏర్పాటు చేస్తున్న గ్రామసభలు రచ్చకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీ స్కీముల్లో అర్హుల పేర్లు గల్లంతు కావడంతో ఈ సభలన్నీ పోలీసుల పహారా మధ్యనే కొనసాగుతున్నాయి. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే పోలీసుల భద్రత లేనిది వెళ్లడం లేదు. సమస్యాత్మక గ్రామాల్లో కూడా పోలీసుల బందోబస్తుతో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఘర్షణలు పడుతుండగా మరికొన్ని చోట్ల అధికారులను తిట్టినంత పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రామసభలకు ఇన్చార్జిగా వ్యవహరించాల్సిన ఒక అధికారిని కలెక్టర్ స స్పెండ్ చేశారు. సభలకు భయపడి వెళ్లకపోవడంతో అధికారులు తొలగించారు.
ధర్మాపూర్‌లో ఆగ్రహం
మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ గ్రామసభలో అధికారులకు ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామసభలో అధికారులను నిలదీసి బం డబూతులు తిట్టారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరో సా, కరెంట్ బిల్లులు, వంటగ్యాస్ సబ్సిడీ, కొత్త రేషన్ కార్డు జారీ, రూ. 4 వేల పింఛన్‌పై అధికారులను నిలదీ శారు. గ్రామస్తులకు అధికారులు సర్ది చెప్పినా వినక పోవడంతో గ్రామసభను ము గిం చుకొని వెళ్లిపోయారు. దేవరకద్ర నియోజకవర్గం కౌ కుంట్ల మండలం రేకులపల్లి గ్రామంలో గ్రామస్తులు ఆగ్రహానికి అధికారులు గ్రామసభ నుంచి వెను దిరి గారు. అర్హుల జాబితాలో అసలైన వారి పేర్లు లేవం టూ ఉట్కూరులో రాస్తారోకో నిర్వహించారు. మా గనూరు మండలం నేరేడుడం గ్రామంలో అర్హులపేర్లు జాబితాలో లేవని ఏకంగా గ్రామసభలు రద్దు చేస్తూ తీర్మానాలు చేశారు. అయిజ మున్సిపాలిటీలో సభను జనం బహిష్కరించారు. మిగతా చోట్ల కూడా గ్రామ సభలు అర్ధాంత రంగా ముగించి వెళ్లి పోయారు. పాల బిల్లుల మాట ఏమైంది సార్ అంటూ వెల్దండ మండలం చౌదర్పల్లిలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని స్థానికులు ప్రశ్నించారు.
మోమిన్‌పూర్‌లో రసాభాస
మద్దూర్ (కొత్తపల్లి)జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అనర్హులకు పెద్దపీట వేశారంటూ గురువారం మండలంలోని మోమినాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో బీఆర్ఎస్ నాయకులు అధికారులు నిలదీయగా, కాంగ్రెస్ నాయకుల జోక్యంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు అర్హూలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే జాబితాలో పేర్లు ఉన్నాయని, వెంటనే అర్హులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య జరుగుతున్న వాగ్వాదం విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టి పోలీసు పహారా
మధ్య గ్రామసభ నిర్వహించారు.