బిజినేపల్లి : పంచాయతీలకు ప్రజాప్రతినిధులు లేక గ్రామ పరిపాలన అస్తవ్యస్థంగా మారుతుందని , వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు (Panchayat Elections ) నిర్వహించాలని సీపీఎం ( CPM ) జిల్లా కమిటీ సభ్యులు జి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిరంతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్శ్రీ రాములుకు వినతి పత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యతో అల్లాడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని, నిజమైన అర్హులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో పారదర్శకతకు అధికారులు చొరవ చూపాలని కోరారు. రేషన్ కార్డులను ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు చంద్రశేఖర్, మహమూద్, పరుశురాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.