హమాలీల సమస్యతో నిలిచిన కొనుగోళ్లు
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో హమాలీల సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు, మూడ్రోజులుగా వ్యాపారులు కొనుగోలు చేసిన వివిధ రకాల పంటల ఉత్పత్తులను హమాలీల కొరత కారణంగా ఎత్తలేదు. దీంతో మా ర్కెట్ షెడ్లు, ఆరుబయట తూకం వేసిన బస్తాలతో నిండిపోయింది.
- బాదేపల్లి మార్కెట్లో భారీగా ధాన్యం, మక్క బస్తాలు
- రెండ్రోజులు కొనుగోలు చేయమని లెటర్ ఇచ్చిన యార్డు వ్యాపారులు
జడ్చర్ల, మే 8 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో హమాలీల సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు, మూడ్రోజులుగా వ్యాపారులు కొనుగోలు చేసిన వివిధ రకాల పంటల ఉత్పత్తులను హమాలీల కొరత కారణంగా ఎత్తలేదు. దీంతో మా ర్కెట్ షెడ్లు, ఆరుబయట తూకం వేసిన బస్తాలతో నిండిపోయింది. దీంతో రైతులు తీసుకొచ్చిన సరుకులను పోయడానికి స్థలం లేకపోవడం, బస్తాలు ఎత్తేవరకు టెండర్లు వేయడం లేదని వ్యాపారులు మా ర్కెట్ అధికారులకు లెటర్‌ద్వారా తెలియజేయడంతో మార్కెట్లో రెండురోజులపాటు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
దీంతో శుక్ర, శనివారం రెండు రోజులతో పాటు ఆదివారం సెలవు ఉండటంతో మూడురోజులపాటు బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి తిరిగి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్‌వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై మార్కెట్ కార్యదర్శి అశ్వక్‌ను వివరణ కోరగా.. హమాలీ కొరత కారణంగా మార్కెట్లో ఆవరణలో ఉన్న బస్తాలను ఎత్తలేదని దాంతో ఇప్పటికే 30 వేల బస్తాలకుపైగా ఉన్నాయి.. అందుకే వా టిని ఎత్తేవరకు సెలవు ఇవ్వాలని వ్యాపారులు కోరడంతో రెండ్రోజులు మార్కెట్లో క్రయవిక్రయా లు నిలిపివేసినట్లు తెలిపారు. హమాలీలు బయటి రా ష్ట్రాల వారు ఉండటంతో వార్డు తమతమ ప్రాంతాలకు వెళ్లారని.. కొందరు హమాలీలు రైల్వే వ్యాగన్లు రెగ్యులర్‌గా వస్తుండటంతో అక్కడికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. సోమవారం నుంచి హమాలీలు వచ్చేలా వారితో మాట్లాడుతున్నట్లు, మార్కెట్‌ను యథావిధిగా కొనసాగించనున్నట్లు కార్యదర్శి తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

