మరికల్, జూన్ 27: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు తరలి వెళ్తున్న జీపీ కార్మికులను మరికల్ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, తమ సమస్యల సాధన కోసం హైదరాబాద్ తరలి వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో రాజు, రాములు, మహేష్ తదితరులు ఉన్నారు.
ధన్వాడ మండలంలో..
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం హైదరాబాద్ వెళుతున్న గ్రామపంచాయతీ కార్మికులను ధన్వాడ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పోలీసుల అరెస్టులను గ్రామపంచాయతీ కార్మికులు ఖండించారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు విడుదల చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉదయభాను, బాలకృష్ణ, సద్దాం, ఇమ్రాన్, రాజు, బాలయ్య, నిరంజన్, నర్సింలు, పెద్ద మాల రాములు ఉన్నారు.