అమిస్తాపూర్‌లోని సారికా టౌన్షిప్లో 96, పోతులమడుగులో 160 ఓపెన్ ప్లాట్లకు టెండర్ : కలెక్టర్ రవినాయక్
మహబూబ్‌నగర్, మార్చి 9 : అమిస్తాపూర్, భూ త్పూర్ మండలం పోతులమడుగు టౌన్‌షిప్‌ల్లోని ఓపెన్‌ప్లాట్లు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని మ హబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. గురువా రం కలెక్టరేట్ కార్యాలయంలో పోతులమడుగు, అమిస్తాపూర్ పరిధిలో టౌన్‌షిప్‌ల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లకు సం బంధించి నిర్వహించిన ఫ్రీబిడ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓపెన్ ప్లాట్లకు 16 నుంచి 18వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమిస్తాపూర్ సారిక టౌన్షిప్ లో 96 ప్లాట్లకు బాదం సరోజిని ఆడిటోరియంలో 17, 18న వేలం ఉంటుందన్నారు. ఈ ప్లాట్లు 60 చదరపు గజాల నుంచి 266 చదరపు గజాల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ధర రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు నిర్ణయించినట్లు తెలిపారు.
పోతులమడుగు లో ఉన్న 160 ఓపెన్‌ప్లాట్లకు 16, 17, 18వ తేదీలలో మహబూబ్‌నగర్‌లోని బాదం సరోజిని ఆడిటోరియంలో బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. పోతులమడుగు టౌన్షిప్లో 140 చదరపు గజాలు నుంచి 400 చదరపు గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ధర రూ.5,500 నుంచి రూ.6,000 వరకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వేలంలో పా ల్గొనే వారు ధరావత్తు కింద రూ.10,000 చెల్లించాలని, ఈ లే-అవుట్ల పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందించి, అనుమతించినవే అన్నారు. ఎలాంటి చిక్కులు గానీ, వివాదాలు లేనివన్నారు. అన్ని వసతులతో అంతర్గత రహదారుల నిర్మాణం, వీధి దీపాలు ఏ ర్పాటు చేశామన్నారు. ప్రణాళికాబద్ధంగా ఈ లే-అవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసిందన్నారు. సమాచారం కోసం https:/mahabubnagar.telangana.gov. in, unda.gov.in./auctions/tsiic. telangana. gov.in, swagruha.telangana.gov.in లలో వి వరాలు పొందవచ్చని తెలిపారు. ఫోన్ : 08542-241165, సెల్ నెం : 7675075365, 79934557 75లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, హౌసింగ్ జిల్లా అధికారి వైద్యం భాస్కర్ తదితరుల పాల్గొన్నారు.