అచ్చంపేట టౌన్, అక్టోబర్ 26 : వివాహ బంధం ఎంతో గొప్పదని.. వరుడు, వధువు జీవితకాలం సుఖసంతోషాలతో మెలగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవవర్మ అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఏసీఆర్ గార్డెన్లో జరిగిన చెంచు సామాజికవ ర్గం సామూహిక వివాహాలకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ హైకోర్టు జ స్టీస్ మాధవిదేవితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పుష్పగుచ్చంతో ఘన స్వా గతం పలికారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయంగా జరిగిన ఈ వివాహలతో చెంచులు తమ వివాహ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకొని సమాజానికి మెరుగైన బాటలు వేయాలని కోరారు.
చెంచులు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా, తమ భాషా, సంస్కృతిపరంగా చాలా శక్తివంతమైన వారని తెలిపారు. విద్యా, సాంకేతిక రంగాల్లో ఆదివాసీలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ కాంక్షించారు. అనంతరం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ క్రమశిక్షణతో, సాంప్రదాయబద్దంగా వనవాసీ నిర్వాహకులు సా మూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమన్నారు. అనంతరం అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశర స్వామీజీ నవ దంపతులకు వివాహ బంధం గురించి వివరించి వారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో వనవాసి కల్యాణ ఆశ్రమం అఖిల భారత కార్యకారిణి రేఖానాగర్, వనవాసి కల్యాణ పరిషత్ అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు ఉ డుతనూరి లింగయ్య, మహిళా ప్రముఖ్ శంఖులత, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.