వనపర్తి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కొడంగల్ ఫార్మా సిటీకి కృష్ణానది నుంచి 7 టీఎంసీల నీటిని తరలించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, దీని వల్ల దేవరకద్ర, మక్త ల్, వనపర్తి, కొల్లాపూర్ ప్రాంత వ్యవసాయ రం గానికి గొడ్డలిపెట్టుగా నిలుస్తుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తిలోని సింగిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లగచర్ల భూసేకరణ, ఫార్మా కంపెనీకి నీటి తరలింపు, సీఎం వరంగల్ పర్యటన, చేతికొచ్చిన పంటలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఫార్మా కంపెనీలకు నీటి తరలింపుతో ఉమ్మడి పా లమూరులోని నాలుగు నియోజకవర్గాల రైతుల కు సాగునీటి కడగండ్లు తప్పవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చర్ల వద్ద ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించిందన్నారు.
ఇక్కడ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తూ ఇందుకు గోదావరి నుంచి నీటిని తరలించాలని అప్పట్లోనే ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఇది పక్కన పెట్టిన సీఎం రేవంత్ కొడంగల్‌లో వద్దన్న చోట ఫార్మాసిటీ పెట్టి ప్రజల జీవితాల్లో కాలుష్యాన్ని నింపడంతోపాటు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్న డం సిగ్గుచేటన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత, మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. రైతులను బెదిరించి, భయపెట్టి, బలవంతంగా భూ సేకరణ చేసి ఫార్మా సిటీ కోసం ఉన్న కొద్ది కృష్ణానదీ జలాలను వాడుకోవాలని చూడడం హేయమైన చర్య అన్నారు. అదనంగా నీళ్లు తెచ్చే పను లు వదిలేసి ఉన్న నీళ్లకు గండి కొడుతున్నాడని మండిపడ్డారు.
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్త్తున్నామని, పాలమూరు రైతుల ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బ తింటాయని ఆందోళన వక్తం చేశారు. ఏడాదిగా ఒక్క టీఎంసీ నీటిని ఇచ్చే పనులను రేవంత్‌రెడ్డి చేపట్టలేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన కొద్ది పనులను పూర్తి చేసుంటే 60 శాతం మేర పొలాలకు నీళ్లు వచ్చేవన్నారు. కాళేశ్వరం నీళ్లే రాలేదని ఎగతాళి చేసుకుంటూ అభండాలతో కాలయాపన చేయడం త ప్పా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాళేశ్వరం నీళ్లే లేకుంటే హల్దీవాగు, ఇతర రిజర్వాయర్లకు సాగునీరెక్కడిదని ప్రశ్నించారు. ప దేండ్ల పాలనలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను తొ లి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దిష్ట కాలపరిమితితో పూర్తిచేసినట్లు గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తె లంగాణకు తాగేందుకు గుక్కెడు నీళ్లివ్వకపోగా, చెరువు, కుంటలను ఎలా ధ్వంసం చేశారో ప్రజ లు కళ్లారా చూడడంతోపాటు తాగు, సాగునీటి గోసపై అనేక పుస్తకాలు సైతం వెలువడ్డాయన్నా రు. బీఆర్ఎస్ హయాంలో భారీ వాగులను అనుసరించి వెయ్యికి పైగా చెక్ డ్యాంలను నిర్మించి సే ద్యానికి సాగునీటిని అందించడం జరిగిందన్నా రు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను చేపట్టి నీటి పారుదల వ్య వస్థను కేసీఆర్ బలోపేతం చేశారన్నారు. తెలంగాణలో అగ్రగామిగా పంటలు పండుతున్నాయని చెబుతున్నారని, ఇందుకు కాంగ్రెస్ చేసిన కృషి ఏ మున్నదో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌కు నేడు సీఎం వె ళ్తున్నాడని, సగం మంది రైతులకు రుణమాఫీ చేసి రైతుభరోసాకు ఎగనామం పెట్టి కాళోజీ కాలక్షేత్రం ప్రారంభోత్సవానికి రేవంత్ వెళ్లడం కాంగ్రె స్ ప్రభుత్వ నైతికతకు నిదర్శనమన్నారు. కాళోజీ పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదని, జీవిత కాలం కాంగ్రెస్ మీదనే పోరాటం చేసి స్ఫూర్తి నింపిన మహనీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. వరంగల్ నుంచే రైతుల తిరుగుబాటు త్వరలోనే మొదలవుతుందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, ఏ ఒక్కరు కూడా సం తోషంగా లేరని మాజీ మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చ వరకు ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తామన్నారు.